ETV Bharat / city

Top news: టాప్​ న్యూస్ @ 11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

author img

By

Published : Feb 3, 2022, 10:59 AM IST

Telangana top news
టాప్​ న్యూస్ @ 11AM
  • ఖైరతాబాద్​లో డబుల్​ బెడ్​ రూమ్​ ఇళ్లు ప్రారంభం

Ktr Inauguration Double Bedroom: హైదరాబాద్​ ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్‌ పర్యటిస్తున్నారు. ఇందిరానగర్‌లో నిర్మించిన రెండుపడక గదుల ఇళ్లను మంత్రి ప్రారంభించారు. మొత్తం 210 గృహాలను లబ్ధిదారులకు అందించనున్నారు.

  • 'చలో విజయవాడ'.. ఎక్కడికక్కడ ఉద్యోగుల నిర్బంధాలు

AP PRC PROTEST: ఏపీలో పీఆర్సీ ఉద్యమం తారాస్థాయికి చేరింది. రాష్ట్ర ప్రభుత్వ జీవోలను వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు చేపట్టిన 'చలో విజయవాడ' కార్యక్రమాన్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ఏపీలోని పలు జిల్లాల నుంచి విజయవాడ బయల్దేరిన ఉద్యోగులను అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో వారంతా పోలీసుల వైఖరి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

  • పూర్తైన అగ్నిమథనం

Statue of Equality Inauguration Celebrations : భక్తులు, వేద పండితుల శ్రీమన్నారాయణ నామస్మరణతో మొదలైన శ్రీరామానుజచార్యుల సహస్రాబ్ది వేడుకలు రెండో రోజు కొనసాగుతున్నాయి. శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా అగ్నిమథనం పూర్తి అయింది.

  • తెలంగాణలోనే తక్కువట

Unemployment in Telangana : కరోనా కేసుల తగ్గుదల, ఒమిక్రాన్ వ్యాప్తి లేనందున దేశంలో ఆంక్షలు సడలించారు. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా భారత్ కాస్త పుంజుకుంటోంది. జనవరిలో దేశ నిరుద్యోగ రేటు భారీగా తగ్గింది. సీఎమ్‌ఐఈ గణాంకాల ప్రకారం.. అత్యంత తక్కువ నిరుద్యోగ రేటును తెలంగాణ రాష్ట్రం నమోదు చేసింది.

  • 'చిత్ర పరిశ్రమ హర్షించేలా టికెట్ల ధరలు'

Cinema Ticket Issue in AP : సినిమా టికెట్ల ధరల పెంపుపై త్వరలో సానుకూల నిర్ణయం వెలువడుతుందని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు వెల్లడించారు. సినిమా టికెట్ల ధరల పరిశీలనకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హోంశాఖ ముఖ్యకార్యదర్శి విశ్వజిత్‌ ఆధ్వర్యంలోని కమిటీ బుధవారం ఆ రాష్ట్ర సచివాలయంలో సమావేశమైంది.

  • తిరుమల భక్తులకు ప్రత్యేక ఆఫర్

Tirumala Bus Tickets: దూర ప్రాంతాల నుంచి తిరుమల వచ్చే భక్తుల కోసం.. ఏపీ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. తిరుపతి, తిరుమల మధ్య రాకపోకలకు టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది.

  • మళ్లీ పెరిగిన కరోనాకేసులు.

COVID CASES IN INDIA: భారత్​లో కరోనా కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు మరో 1.72లక్షల మందికి వైరస్​ నిర్ధరణ అయింది. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 1008 మంది మరణించారు. దేశంలో పాజిటివిటీ రేటు 10.99 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • 'పాక్​ రాయబారిని తిరస్కరించండి'.. బైడెన్​కు విజ్ఞప్తి

Masud Khan Pak Envoy To America: అమెరికాలో పాకిస్థాన్ రాయబారిగా మసూద్ ఖాన్​ను నియమించడంపై భారత ఉన్నతస్థాయి బృందం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మసూద్ ఖాన్ నియామకాన్ని తిరస్కరించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​కు విజ్ఞప్తి చేసింది.

  • నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Stock market live updates: బడ్జెట్ సానుకూల ప్రభావంతో వరుసగా రెండురోజులు లాభాలను ఆర్జించిన స్టాక్​ మార్కెట్లు గురువారం సెషన్​ను మాత్రం ఫ్లాట్​గా ప్రారంభించాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​ 154 పాయింట్ల నష్టంతో 59,403 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 17 పాయింట్ల పతనంతో 17,744 వద్ద ట్రేడవుతోంది.

  • ప్రొఫెషనల్​గా 'పిల్లో ఫైట్‌'..?

Pillow fight Championship: 'పిల్లో ఫైట్‌'ను అధికారిక ప్రొఫెషనల్‌ క్రీడా పోటీగా మార్చేశారు. దీనికి సంబంధించిన పోటీలు ఇటీవలే జరిగాయి. 24 మంది పోటీదారులు ఇందులో పాల్గొన్నారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది? ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులు ఎవరంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.