ETV Bharat / city

TOP NEWS: టాప్​టెన్​ న్యూస్ @9AM - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS
టాప్​ న్యూస్ @ 9AM
author img

By

Published : Feb 1, 2022, 8:59 AM IST

మూడేళ్ల నుంచి ధరల పెరుగుదల దేశాన్ని పీడిస్తోంది. పదేపదే పెరుగుతున్న పెట్రో ఉత్పత్తుల ధరలు ప్రజల నడ్డివిరుస్తున్నాయి. అయినా విత్తలోటును తగ్గించుకోవడానికి ప్రభుత్వం పన్నులు పెంచుతూనే ఉంది. జీడీపీలో వాస్తవ విత్తలోటును రెండుశాతం తక్కువ చేసి చూపుతున్నట్లు ప్రభుత్వం సైతం అంగీకరించింది.

  • ధరణి లావాదేవీల్లో గందరగోళం

Dharani problems: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ సమస్యలు తీర్చేందుకు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సతాయిస్తోంది. సోమవారం మరో కొత్త సమస్య తెరమీదికొచ్చింది. రైతుల ఖాతాల్లో డబ్బులు కోతపడినా ఎక్కడికెళ్లాయో తెలియని పరిస్థితి నెలకొంది. మరోపక్క మంగళవారం నుంచి కొత్త మార్కెట్‌ విలువలు అమలుకానుండటంతో తమకు పాతధరలు వర్తిస్తాయో లేదోనన్న అయోమయంలో ఉన్నారు.

  • భయం నుంచి పుట్టిన బడ్జెట్‌..?

Azadi Ka Amrit Mahotsav: బ్రిటిష్‌ రాజ్యం పోయినా.. వారి పద్ధతులు, సంప్రదాయాలు అనేకం అలాగే కొనసాగుతున్నాయి. వాటిలో ఒకటి బడ్జెట్‌! ఆంగ్లేయుల కాలంలో ఆరంభమైంది ఈ బడ్జెట్‌. ఇంగ్లాండ్‌లో నష్టాలతో దివాలా అంచులకు చేరి వ్యాపారాన్నంతటినీ అమ్ముకున్న ఓ ఊలు వ్యాపారి.. ఆర్థికవేత్తగా అవతారమెత్తి భారతావని ఆర్థిక భాగ్యచక్రాన్ని రాయటానికి శ్రీకారం చుట్టడం విశేషం.

  • సంక్షోభాలను ఎదుర్కొనే శక్తి వారి సొంతం

Margadarsi MD Sailaja Kiran : మహిళలు పుట్టుకతోనే సమర్థులని, నిర్ణయాత్మక శక్తిని కలిగి ఉంటారని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజాకిరణ్‌ అన్నారు. నిస్వార్థగుణంతో తమ భవిష్యత్తును త్యాగం చేస్తూ కుటుంబానికి అంకితమవుతున్నారని తెలిపారు. తానా సంస్థ ఆధ్వర్యంలో ‘మహిళా సాధికారత శక్తి’ అనే అంశంపై ఆదివారం రాత్రి జరిగిన వెబినార్‌లో ఆమె ముఖ్య వక్తగా పాల్గొన్నారు.

  • మహారాజ్ జీ మాయ కొనసాగేనా?

up election 2022: రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ఉత్తర్​ప్రదేశ్​లో ఎన్నికలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. బలమైన నేతలు పార్టీలు మారుతుండడం కొంతమేరకు నేతలను కలవరపాటుకు గురి చేస్తుంది. ఇదిలా ఉంటే భాజపాకు కీలకమైన గోరఖ్‌పుర్‌ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించేందుకు ప్రధానంగా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభపైనే ఆశలు పెట్టుకుంది ఆ పార్టీ. అందుకే వ్యూహాత్మకంగా ఆయన్ను రంగంలోకి దింపింది. ఇది ఎంతవరకు కలసి వస్తుంది అనేది తెలుసుకుందాం.

  • కాటేసిన కోబ్రా.. పరిస్థితి విషమం

Snake Catcher Vava Suresh: పాములు పట్టడంలో దిట్ట అయిన కేరళవాసి వావ సురేశ్​.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఓ పామును పట్టుకునేందుకు వెళ్లిన ఆయన మోకాలిపై కోబ్రా కాటేసింది.

  • భారత్​ తరఫున ఒకేఒక్కడు

Bejing Winter Olympics Arif Khan: బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌లో భారత్​కు ప్రాతినిధ్యం వహించడంపై ఆనందం వ్యక్తం చేశాడు జమ్ముకశ్మీర్​కు చెందిన స్కీయర్​ ఆరిఫ్​ ఖాన్​. ఈ ఒలింపిక్స్​లో పోటీపడనున్న ఏకైక భారత అథ్లెట్​ అతడే.

  • సమంత గ్రీన్​సిగ్నల్​!

Samantha karthi movie: తమిళ హీరో కార్తి నటించనున్న కొత్త సినిమాకు హీరోయిన్​ సమంత గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. కాగా, మలయాళ హీరో దుల్కర్​ సల్మాన్​ నటించనున్న ఓ వెబ్​సిరీస్​కు 'గన్స్​ అండ్​ గులాబ్స్'​ టైటిల్​ ఖరారు చేసినట్లు సమాచారం.

  • ఈసారైనా నెరవేరేనా..?

ఈసారైనా భాగ్యనగరంపై నిర్మలమ్మ కరుణ చూపుతారా..? గత బడ్జెట్​లో రాష్ట్రంతో పాటు గ్రేటర్​కు నిరాశే మిగిల్చిన కేంద్రం.. ఈ ఏడాదైనా నిధులు కేటాయిస్తుందా..? ఇవాళ పార్లమెంట్​లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్​వైపు భాగ్యనగరం ఆశగా చూస్తోంది.

  • రాష్ట్రంపై చలి పంజా

Low Temperature in Telangana : రాష్ట్రంలో చలిపులి పంజా విసురుతోంది. చలి తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. రాత్రి వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనాలు వణికిపోతున్నారు. సాయంత్రం అయిందంటే ఇంటి నుంచి బయట కాలుపెట్టలేని పరిస్థితి నెలకొంది.

  • వాటితో లాభపడిందెవరు?

మూడేళ్ల నుంచి ధరల పెరుగుదల దేశాన్ని పీడిస్తోంది. పదేపదే పెరుగుతున్న పెట్రో ఉత్పత్తుల ధరలు ప్రజల నడ్డివిరుస్తున్నాయి. అయినా విత్తలోటును తగ్గించుకోవడానికి ప్రభుత్వం పన్నులు పెంచుతూనే ఉంది. జీడీపీలో వాస్తవ విత్తలోటును రెండుశాతం తక్కువ చేసి చూపుతున్నట్లు ప్రభుత్వం సైతం అంగీకరించింది.

  • ధరణి లావాదేవీల్లో గందరగోళం

Dharani problems: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ సమస్యలు తీర్చేందుకు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సతాయిస్తోంది. సోమవారం మరో కొత్త సమస్య తెరమీదికొచ్చింది. రైతుల ఖాతాల్లో డబ్బులు కోతపడినా ఎక్కడికెళ్లాయో తెలియని పరిస్థితి నెలకొంది. మరోపక్క మంగళవారం నుంచి కొత్త మార్కెట్‌ విలువలు అమలుకానుండటంతో తమకు పాతధరలు వర్తిస్తాయో లేదోనన్న అయోమయంలో ఉన్నారు.

  • భయం నుంచి పుట్టిన బడ్జెట్‌..?

Azadi Ka Amrit Mahotsav: బ్రిటిష్‌ రాజ్యం పోయినా.. వారి పద్ధతులు, సంప్రదాయాలు అనేకం అలాగే కొనసాగుతున్నాయి. వాటిలో ఒకటి బడ్జెట్‌! ఆంగ్లేయుల కాలంలో ఆరంభమైంది ఈ బడ్జెట్‌. ఇంగ్లాండ్‌లో నష్టాలతో దివాలా అంచులకు చేరి వ్యాపారాన్నంతటినీ అమ్ముకున్న ఓ ఊలు వ్యాపారి.. ఆర్థికవేత్తగా అవతారమెత్తి భారతావని ఆర్థిక భాగ్యచక్రాన్ని రాయటానికి శ్రీకారం చుట్టడం విశేషం.

  • సంక్షోభాలను ఎదుర్కొనే శక్తి వారి సొంతం

Margadarsi MD Sailaja Kiran : మహిళలు పుట్టుకతోనే సమర్థులని, నిర్ణయాత్మక శక్తిని కలిగి ఉంటారని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజాకిరణ్‌ అన్నారు. నిస్వార్థగుణంతో తమ భవిష్యత్తును త్యాగం చేస్తూ కుటుంబానికి అంకితమవుతున్నారని తెలిపారు. తానా సంస్థ ఆధ్వర్యంలో ‘మహిళా సాధికారత శక్తి’ అనే అంశంపై ఆదివారం రాత్రి జరిగిన వెబినార్‌లో ఆమె ముఖ్య వక్తగా పాల్గొన్నారు.

  • మహారాజ్ జీ మాయ కొనసాగేనా?

up election 2022: రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ఉత్తర్​ప్రదేశ్​లో ఎన్నికలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. బలమైన నేతలు పార్టీలు మారుతుండడం కొంతమేరకు నేతలను కలవరపాటుకు గురి చేస్తుంది. ఇదిలా ఉంటే భాజపాకు కీలకమైన గోరఖ్‌పుర్‌ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించేందుకు ప్రధానంగా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభపైనే ఆశలు పెట్టుకుంది ఆ పార్టీ. అందుకే వ్యూహాత్మకంగా ఆయన్ను రంగంలోకి దింపింది. ఇది ఎంతవరకు కలసి వస్తుంది అనేది తెలుసుకుందాం.

  • కాటేసిన కోబ్రా.. పరిస్థితి విషమం

Snake Catcher Vava Suresh: పాములు పట్టడంలో దిట్ట అయిన కేరళవాసి వావ సురేశ్​.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఓ పామును పట్టుకునేందుకు వెళ్లిన ఆయన మోకాలిపై కోబ్రా కాటేసింది.

  • భారత్​ తరఫున ఒకేఒక్కడు

Bejing Winter Olympics Arif Khan: బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌లో భారత్​కు ప్రాతినిధ్యం వహించడంపై ఆనందం వ్యక్తం చేశాడు జమ్ముకశ్మీర్​కు చెందిన స్కీయర్​ ఆరిఫ్​ ఖాన్​. ఈ ఒలింపిక్స్​లో పోటీపడనున్న ఏకైక భారత అథ్లెట్​ అతడే.

  • సమంత గ్రీన్​సిగ్నల్​!

Samantha karthi movie: తమిళ హీరో కార్తి నటించనున్న కొత్త సినిమాకు హీరోయిన్​ సమంత గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. కాగా, మలయాళ హీరో దుల్కర్​ సల్మాన్​ నటించనున్న ఓ వెబ్​సిరీస్​కు 'గన్స్​ అండ్​ గులాబ్స్'​ టైటిల్​ ఖరారు చేసినట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.