ETV Bharat / city

Telangana Top news టాప్ న్యూస్ 9PM - టాప్ న్యూస్ ఇన్ తెలంగాణ

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News
Telangana Top News
author img

By

Published : Aug 18, 2022, 8:57 PM IST

  • వారికి నచ్చకపోతే అవినీతా అంటూ ప్రశ్నించిన హరీశ్

Harish Rao Comments కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కేంద్రమంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​ చేసిన వ్యాఖ్యలను మంత్రి హరీశ్​రావు తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వ తప్పులను తెరాస ప్రభుత్వం ఎత్తిచూపుతూ వాస్తవాలను ప్రజల ముందు ఉంచడం వల్లే అసత్య ప్రచారం చేస్తున్నారని హరీశ్​ ఆరోపించారు.

  • ఇలాంటివి మన దేశంలోనే చెల్లుతాయన్న కేటీఆర్​

KTR on Bilkis Bano Case బిల్కిస్​ బానో అత్యాచార దోషుల్ని విడుదల చేయటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్​ ఇదే ఘటనపై మరోసారి ట్విటర్​ వేదికగా స్పందించారు. ఈసారి నిర్వేదంతో కూడిన ఆక్రోశాన్ని మంత్రి కేటీఆర్​ వెల్లగక్కారు. ప్రతి ఒక్కరు దీనిపై గొంతెత్తాలని సూచించారు. అసలేమైందంటే

  • రాజీనామా చేసే ప్రసక్తే లేదన్న మహేశ్వర్‌రెడ్డి

Maheshwar Reddy denied resignation news అధిష్ఠానానికి మాణికం ఠాగూర్‌పై లేఖ, రాజీనామా చేస్తున్నానంటూ వస్తున్న వార్తల్ని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఖండించారు. చావో రేవో కాంగ్రెస్‌లోనేనని, ఐక్యంగా పార్టీ విజయానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మాణికం ఠాగూర్ తనకు మంచి మిత్రుడని అతనితో తనకెలాంటి వివాదాలు లేవని మహేశ్వర్​రెడ్డి స్పష్టం చేశారు.

  • రాష్ట్రవ్యాప్తంగా సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

Sardar Sarvai Papanna Birth Anniversary అణిచివేతపై తిరుగుబాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వివిధ పార్టీల నేతలు, అధికారులు సర్వాయి పాపన్నకు నివాళులర్పించారు. ఆనాడు సమాజంలో జరిగిన అన్యాయాలను ఎదిరించిన గొప్ప వీరుడు సర్వాయి పాపన్న అంటూ కొనియాడారు.

  • 8 యూట్యూబ్‌ ఛానళ్లపై కేంద్రం వేటు

Fake youtube channels blocked 8 యూట్యూబ్​ ఛానళ్లను బ్లాక్​ చేసింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇందులో ఏడు భారత్‌కు చెందినవి కాగా ఒకటి పాకిస్థాన్‌కు చెందినదిగా కేంద్రం తెలిపింది. కారణం ఏంటంటే

  • ఆ రోజే అన్నీ చెబుతానన్న సీజేఐ జస్టిస్​ ఎన్‌వీ రమణ

CJI Ramana Retirement తాను చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయని, వాటన్నింటినీ వీడ్కోలు ప్రసంగంలో చెబుతానన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ. మరోవైపు మన దేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ప్రవాస భారతీయులకూ కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం స్పందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

  • దోషుల విడుదలపై బాధితురాలు అసహనం

Bilkis Bano Statement 2002 గోద్రా అల్లర్లలో బిల్కిస్​ బానోపై జరిగిన అత్యాచార ఘటనలో దోషులను విడుదల చేయడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దోషులను విడుదల చేయడం తనతోనే కాకుండా కోర్టుల్లో న్యాయం కోసం పోరాడుతున్న ప్రతీ మహిళ స్థైర్యాన్ని దెబ్బ తీస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.

  • పెట్రో ధరలు తగ్గినా మనకు లేనట్టే

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర 6 నెలల కనిష్ఠానికి దిగివచ్చింది. ఐతే ఇప్పుడప్పుడే ఆ ప్రయోజనం దేశీయ వినియోగదారులకు అందేలా లేదు. ఇన్నాళ్లూ నష్టాలు భరించి పెట్రోల్‌, డీజిల్‌ను విక్రయిస్తూ వచ్చిన దేశీయ చమురు సంస్థలు ఆ నష్టాలను పూడ్చుకోనున్నాయి. అందుకు మరికొన్ని రోజులు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగే అవకాశం ఉంది.

  • ఓటీటీలో సినిమాల రిలీజ్​పై నిర్మాతల ఏకాభిప్రాయం

సినిమాలు ఓటీటీల్లో విడుదల చేసే విషయమై నిర్మాతలంతా ఓ నిర్ణయానికి వచ్చారని ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్​రాజు తెలిపారు. ఇక నుంచి విడుదలయ్యే ప్రతి సినిమా 8 వారాల తర్వాతే ఓటీటీలో రావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. త్వరలోనే షూటింగ్స్‌ మొదలు పెడదామని భావిస్తున్నామన్నారు.

  • 10 వికెట్లతో ఘనవిజయం

జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్​లో సత్తా చాటింది. ఆల్​రౌండ్ ప్రదర్శనతో పది వికెట్ల తేడాతో గెలుపొందింది. అదే సమయంలో పలు రికార్డులు సైతం నెలకొల్పింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.