రఘురామ కేసులో..
ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ తీరు, తదనంతర పరిణామాలపై జాతీయ మానవహక్కుల సంఘం నోటీసులు చేసింది. నాలుగువారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఏపీ డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అనిశాకు సుప్రీం నోటీసులు
ఓటుకు నోటు కేసు(Vote For Note Case)లో తెలంగాణ ఏసీబీ(ACB)కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్‌పై ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎంపీ రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సుప్రీంను ఆశ్రయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఉల్లిగడ్డపై నల్లని పొర వల్ల బ్లాక్ ఫంగస్ వస్తుందా..?
కరోనా(corona) మహమ్మారి తర్వాత జనాలను భయపెడుతున్న సమస్య బ్లాక్‌ఫంగస్(black fungus). కొవిడ్ సోకిన వారిలోనే కనిపిస్తోన్న ఈ లక్షణాలకు కారణాలపై... సోషల్ మీడియా(social media)లో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
యువతిపై గ్యాంగ్ రేప్.. వీడియో తీసి, వైరల్ చేసి...
బెంగళూరులో దారుణం జరిగింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యవతిపై కొంతమంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను తమ ఫోన్లో చిత్రీకరించారు. అనంతరం మహిళను కేరళలో బంధించారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోలు వైరల్‌గా మారగా.. బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేపట్టి బాధితురాలిని విడిపించారు. ఈ కేసులో ఇద్దరు మహిళలు సహా ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2-డీజీ డ్రగ్ ధర ఎంతంటే!
డీఆర్డీఓ అభివృద్ధి చేసిన 2డీజీ(2DG drug) కరోనా ఔషధం ధరను రూ.990గా నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ ఆసుపత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాయితీ ఉంటుందని పేర్కొన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వుహాన్ ల్యాబ్పైనే వారి అనుమానం!
కరోనా వైరస్ మూలాల(coronavirus origin) విషయమై చైనా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. కొవిడ్-19 పుట్టుకకు సంబంధించి మరింత స్పష్టమైన సమాచారం కావాలని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు డిమాండ్ చేస్తుండటమే ఇందుకు కారణం. చైనా చెబుతున్నట్లు అలుగు నుంచి వైరస్ వ్యాప్తి చెంది ఉండకపోవచ్చని, వుహాన్( ల్యాబ్( wuhan lab)నుంచే బయటకు రావచ్చని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఛోక్సీది అరెస్ట్ కాదు కిడ్నాప్!
డొమినికా పోలీసుల అదుపులో ఉన్న మెహుల్ ఛోక్సీని(Mehul Choksi) కలిసేందుకు తమకు అనుమతినివ్వలేదని ఆయన తరఫు లీగల్ టీం వెల్లడించింది. కొంతమంది వ్యక్తులు ఛోక్సీని(Mehul Choksi) కిడ్నాప్ చేసి డొమినికా తీసుకెళ్లినట్లు ఆరోపించింది. అక్కడి పోలీసులు ఛోక్సీని తీవ్రంగా కొట్టినట్లు అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం ప్రధాన నిందితుల్లో ఛోక్సీ కూడా ఒకరు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
యూజర్లపై కేంద్రం నిఘా- నిజమేనా?
కొత్త ఐటీ నిబంధనలపై కేంద్రం వివరణ ఇచ్చింది. సోషల్ మీడియా(social media) వినియోగదారుల ఫోన్ కాల్స్‌ను పర్యవేక్షించనున్నట్టు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొంది. అటువంటి విషయాలు కొత్త నిబంధనల్లో లేవని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ గురించే చర్చ
వర్చువల్ విధానంలో శనివారం జరగనున్న బీసీసీఐ ప్రత్యేక సమావేశంలో ప్రధానంగా మూడు విషయాల గురించి చర్చించనున్నారు. వాటిలో ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లు, టీ20 ప్రపంచకప్ నిర్వహణతో పాటు రంజీ క్రికెటర్లకు పరిహారం ఇచ్చే దాని గురించి మట్లాడనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మా గుండెల్ని మరొక్కసారి తాకిపో తాతా!
నట సౌర్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతి (ntr jayanthi) సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు జూనియర్ ఎన్టీఆర్. భావోద్వేగ సందేశాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.