CEO Shashank Goyal Relieve : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్‌ను రిలీవ్ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. డిప్యుటేషన్‌పై కేంద్ర కార్మికశాఖ అదనపు కార్యదర్శిగా నియమిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ గత నెల 18న నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ఆయన సీఈవో విధుల నుంచి రిలీవ్ కాలేదు. తాజాగా గోయల్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి బాధ్యతల నుంచి రిలీవ్ చేసేందుకు అనుమతించిన ఈసీ... ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమాచారం పంపింది. ఈసీ సూచనలపై సీఈవో శశాంక్ గోయల్‌ను రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేసింది.
శశాంక్ గోయల్ రిలీవ్ నేపథ్యంలో అదనపు సీఈవో జ్యోతిబుద్ధ ప్రకాశ్‌ను ఇన్‌ఛార్జి సీఈవోగా నియమించారు. గోయల్‌ను రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేశాక.. జ్యోతి బుద్ధప్రకాశ్‌కు బాధ్యతలు అప్పగిస్తారు. కొత్త సీఈవో కోసం రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు అధికారుల పేర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంది.
ఇదీ చూడండి : CEO Shashank Goyal: సీఈవో శశాంక్ గోయల్‌ను రిలీవ్ చేసేందుకు ఈసీ అనుమతి