ETV Bharat / city

Gram Panchayats Online Audit : పంచాయతీ ఆన్​లైన్ ఆడిట్​లో తెలంగాణ నంబర్ వన్

Gram Panchayats Online Audit: గత ఆర్థిక సంవత్సరంలో గ్రామపంచాయతీల ఆడిట్‌ను రాష్ట్రం వందశాతం పూర్తి చేసి దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచిందని కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ ప్రశంసించింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సంయుక్త కార్యదర్శి కేఎస్ సేథీ రాష్ట్రానికి లేఖ రాశారు. ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌లో తొలిస్థానంలో నిలిచినందున ఎర్రబెల్లికి ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు.

Gram Panchayats Online Audit
Gram Panchayats Online Audit
author img

By

Published : Dec 24, 2021, 10:12 AM IST

Gram Panchayats Online Audit: రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే అనేక కేంద్ర ప్రభుత్వ అవార్డులను గెలుచుకుంది. తాజాగా గ్రామ పంచాయతీల ఆన్​లైన్ ఆడిటింగ్​లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్​గా నిలిచింది. అంతకుముందు కూడా మొదటి స్థానంలో నిలవడం విశేషం. అదే ఒరవడిని కొనసాగిస్తూ వరుసగా రెండో సారి నంబర్​ వన్ స్థానంలో నిలిచి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని కేంద్ర పంచాయతీరాజ్​ శాఖ ప్రశంసించింది. ఈ మేరకు ఆ శాఖ సంయుక్త కార్యదర్శి కేఎస్ సేథీ రాష్ట్రానికి లేఖ రాశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిధులు పొందాలంటే 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 25 శాతం ఆడిట్‌ విధిగా పూర్తి చేసి ఉండాలని గుర్తు చేశారు.

తెలంగాణ నంబర్ వన్..

Online Audit of Panchayats Telangana : కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల వినియోగంపై ఎప్పటికప్పుడు ఆడిటింగ్ నిర్వహిస్తోంది. 2020-21 వ సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం విషయమై ఆన్​లైన్ ఆడిటింగ్ నిర్వహిస్తూ అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జారీ చేసింది. వాటికనుగుణంగా ఆయా రాష్ట్రాల్లోని స్థానిక సంస్థలు తాము చేసిన నిధుల ఖర్చును ఆన్​లైన్​లోనే అందిస్తున్నాయి. ఈ విధంగా నిర్ణీత గడువు కంటే ముందే వందకు వంద శాతం ఆన్​లైన్ ఆడిటింగ్ పూర్తిచేసిన తెలంగాణ, దేశంలో నంబర్ వన్​గా నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో 72 శాతంతో తమిళనాడు, 60 శాతంతో ఆంధ్రప్రదేశ్​, 59 శాతంతో కర్ణాటక రాష్ట్రాలున్నాయి. మిగతా రాష్ట్రాలు 25 శాతంలోపే ఆన్​లైన్ ఆడిటింగ్ పూర్తి చేసి వెనుకబడ్డాయి. 2019-20 సంవత్సరానికి 14వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై నిర్వహించిన ఆన్​లైన్ ఆడిటింగ్​లో కూడా తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్​గా నిలవడం విశేషం.

దేశంలో అగ్రగామిగా తెలంగాణ పల్లెలు..

Online Audit of Panchayats 2020 : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలుస్తున్నాయని, దేశానికి ఆదర్శంగా ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన పల్లె ప్రగతి వంటి పథకాలు, మంత్రి కేటీఆర్ నాయకత్వం పల్లెలను ప్రగతి పథంలో నడిపిస్తున్నాయని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక సంఘం నిధులకు సమానంగా రాష్ట్ర నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి బాటలు వేశారని చెప్పారు. బాపూజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

ప్రశంసలతోపాటు నిధులూ ఇవ్వాలి..

Online Audit of Telangana Panchayats: అవార్డులు, ప్రశంసలతోపాటు నిధులూ ఎక్కువగా ఇచ్చి ప్రోత్సహించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కేంద్రాన్ని కోరారు. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ, నిధులను సద్వినియోగం చేసుకుంటూ, ఆన్​లైన్​ ఆడిటింగ్​లో కూడా నంబర్ వన్​గా నిలుస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. మంత్రి ఎర్రబెల్లికి అభినందనలు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.