సచివాలయ నూతన భవన సముదాయానికి ఫ్రాన్స్‌కు చెందిన ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్‌ని స్ఫూర్తిగా తీసుకోవటం విశేషం. 1623లో రాజు లూయీస్-13 ఈ ప్యాలెస్‌ను నిర్మించారు. ఈ భవనం అద్భుతమైన ఆకృతితో అడుగడుగునా కళాత్మకతతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది సందర్శకులను ఆకట్టుకుంటుంది. రాజు లూయీస్-13 వేటకు వెళ్లిన సందర్భంలో విడిది చేసేందుకు ఈ నిర్మాణాన్ని చేపట్టారు. వర్సైల్స్ గ్రామ సమీపంలో ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్యాలెస్‌లో 700 గదులున్నాయి. ఆనాటి ఫ్రెంచి విప్లవానికి ఇది ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. ఫ్రెంచి విప్లవం తరవాత కూడా ఇది ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదిక అయింది. మొదటి ప్రపంచ యుద్ధం అధికారిక ముగింపు ఒప్పందం 1919 జూన్ 28న ఈ ప్యాలెస్‌లోని హాల్ ఆఫ్ మిర్రర్స్‌లో జరగటం విశేషం.
ఇవీచూడండి: హైదరాబాద్ సంస్కృతి ప్రతిబింబించేలా కొత్త సచివాలయం