సచివాలయం కూల్చివేతపై 2016లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై ఎలా విచారణ చేపట్టాలని హైకోర్టు ప్రశ్నించింది. కేబినెట్ నిర్ణయం తీసుకోక ముందే... పత్రికల్లో కథనాల ఆధారంగా వ్యాజ్యం దాఖలు చేశారని అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రిమండలి ఈ ఏడాది జూన్ 8న నిర్ణయం తీసుకున్న తర్వాత... దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరుపుతామని... అవసరమైతే తాజాగా పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. అయితే వ్యాజ్యం 2016లో దాఖలు చేసినప్పటికీ... సచివాలయం కూల్చివేతను ఆపాలనే అందులో కోరామని.. కాబట్టి తమ వాదనలు కూడా వినాలని జీవన్ రెడ్డి తరఫు న్యాయవాది సత్యం రెడ్డి వాదించారు. సచివాలయం కూల్చివేతపై దాఖలైన వ్యాజ్యాలన్నీ కలిపి.. తమ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించిన హైకోర్టు... తదుపరి విచారణను ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: హుజూర్నగర్లో గులాబీ జెండా ఎగురుతుంది: కేటీఆర్