ETV Bharat / city

కొనసాగుతున్న సచివాలయ భవనాల కూల్చివేత - తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత

secretariat buildings demolition
కొనసాగుతున్న సచివాలయ భవనాల కూల్చివేత
author img

By

Published : Jul 7, 2020, 6:52 AM IST

Updated : Jul 7, 2020, 10:26 AM IST

06:51 July 07

కొనసాగుతున్న సచివాలయ భవనాల కూల్చివేత

సచివాలయం భవనాల కూల్చివేత పనులు ప్రారంభం

       సచివాలయం భవనాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. హైకోర్టు స్పష్టతనిచ్చిన నేపథ్యంలో అధికారులు తెల్లవారుజామునే పనులు మొదలుపెట్టారు. భారీ పోలీస్‌ బందోబస్తు మధ్య సచివాలయం భవనాల కూల్చివేత పనులు నడుస్తున్నాయి. ఆటు వైపు వెళ్లే మార్గాలన్నీ పోలీసులు మూసివేశారు. వాహనాలతో సహా ఎవరినీ అధికారులు అనుమతించట్లేదు. కూల్చివేత పనులను ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.  

            సచివాలయ కూల్చివేత దృష్ట్యా పలు మార్గాల్లో రహదారులు మూసివేశారు. ట్యాంక్‌బండ్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌, నెక్లెస్‌రోడ్‌ దారుల్లో వాహనాలకు అనుమతివ్వట్లేదు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను పోలీసులు పంపిస్తున్నారు. ప్రయాణానికి అనుమతి ఇవ్వకపోవడం వల్ల పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగుతున్నారు. 

       ఖైరతాబాద్, రవీంద్రభారతి, హిమాయత్​నగర్ కూడళ్ల వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.  సచివాలయం వైపుగా వెళ్లే దారులను అర కిలోమీటర్ ముందే మూసేసిన పోలీసులు.. అటుగా వాహనాలు వెళ్లనీయకుండా దారి మళ్లిస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఆయా ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటుచేశారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్​పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 

Last Updated : Jul 7, 2020, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.