గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసిన ఎస్ఈసీ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయింది. 11 గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో వివిధ అంశాలపై చర్చించింది. వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల ఖరారు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, అభ్యర్థుల వ్యయం తదితర అంశాలపై వారి అభిప్రాయాలను స్వీకరించింది.
జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఓటర్ల జాబితా ముసాయిదాను ఇప్పటికే ప్రకటించింది. పోలింగ్ కేంద్రాల ఖరారుకు సంబంధించి షెడ్యూల్ జారీ చేసింది. వీటితో పాటు ఎన్నికలకు సంబంధించిన ఇతర అంశాలపైనా పార్టీల ప్రతినిధులతో ఎస్ఈసీ చర్చలు జరిపింది.
ఇవీచూడండి: నేడు మంత్రులతో కేసీఆర్ భేటీ.. గ్రేటర్ ఎన్నికలపై చర్చ