పురపాలక ఎన్నికల ప్రచారం కోసం రాజకీయ పార్టీలకు స్టార్ క్యాంపెయినర్లకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు 20 మందిని, గుర్తింపు పొందని పార్టీలకు ఐదుగురికి స్టార్ క్యాంపెయినర్లుగా అవకాశం ఉంటుంది.
స్టార్ క్యాంపెయినర్ల కోసం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి మూడు రోజుల్లోపు ఆయా పార్టీలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాతో పాటు వారి బయోడేటా, గుర్తింపు కార్డు వివరాలను అందించాల్సి ఉంటుంది. స్టార్ క్యాంపెయినర్లకు రాష్ట్ర ఎన్నికల అనుమతి ఇవ్వడంతో పాటు వాహనాలకు పాస్లు ఇస్తారు.
స్టార్ క్యాంపెయినర్లు పాల్గొనే చోట అభ్యర్థులు లేదా వారి ఎన్నికల ఏజెంట్లు పాల్గొంటే రవాణా ఖర్చులు మినహా మిగతా ఖర్చునంతా సదరు అభ్యర్థి ఖాతాలోనే వేస్తారు. అభ్యర్థులు లేకున్నా బ్యానర్లు, పోస్టర్లపై వారి ఫొటోలు ఉన్నా కూడా ప్రచారవ్యయాన్ని అభ్యర్థుల ఖాతాలోనే వేస్తారు. ఒకరి కంటె ఎక్కువ మంది అభ్యర్థులుంటే ఖర్చును వారందరికీ సమానంగా పంచుతారు.
ఇదీ చదవండిః చంద్రబాబును ఆయన నివాసానికి తరలించిన పోలీసులు