ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో చేపట్టిన కార్మికుల సమ్మె నేటితో 13 రోజుకు చేరింది. సమ్మెకు మద్దతుగా ఈరోజు హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో సామూహిక దీక్షలు నిర్వహించనున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ ఐకాస స్పష్టం చేసింది. రాష్ట్రంలోని అన్నీ డిపోల ముందు ధూంధాం కార్యక్రమాలతో కార్మికులు నిరసన తెలపనున్నారు. వీరికి మద్దతుగా విద్యార్థి సంఘాలు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీతోపాటు ప్రగతి భవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
- ఇదీ చూడండి : ఇక చర్చలకు ఆస్కారమే లేదు: సీఎం