ఆర్టీసీ బస్సు ఛార్జీలను కిలోమీటరుకు 20 పైసలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కనీస ఛార్జీని అధికారులు వెల్లడించారు. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో కనీస ఛార్జీని రూ.10గా నిర్ణయించారు. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.15 కనీస ఛార్జీలను వసూలు చేయనున్నారు. డీలక్స్ బస్సుల్లో రూ.20, సూపర్ లగ్జరీల్లో రూ.25, రాజధాని, వజ్ర, గరుడ, గరుడ ప్లస్ ఏసీ బస్సుల్లో రూ.35లను కనీస ఛార్జీలుగా నిర్ణయించారు. వెన్నెల ఏసీ స్లీపర్ కనీస ఛార్జీలను రూ.70కి పెంచారు. ఈ మేరకు కొత్త ధరలను టిమ్ యంత్రాల్లో నిక్షిప్తం చేస్తున్నారు. పెరిగిన ఛార్జీలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.
పెరిగిన ఛార్జీలు కింది విధంగా ఉన్నాయి
సిటీ బస్సులు
సిటీ బస్ పాస్‌లు
జిల్లా సర్వీస్ బస్సులు
పల్లెవెలుగు బస్సులు
కాంబో టికెట్ ఛార్జీలు