ETV Bharat / city

Telangana corona cases: రాష్ట్రంలో కొత్తగా 1825 కరోనా కేసులు - total number of covid 19 cases in telangana

telangaan corona news
telangaan corona news
author img

By

Published : Jan 10, 2022, 6:52 PM IST

Updated : Jan 10, 2022, 8:31 PM IST

18:49 January 10

రాష్ట్రంలో కొత్తగా 1825 కరోనా కేసులు

Telangana corona cases: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 70,697 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1825 మందికి వైరస్​ సోకినట్లు నిర్ధారణ అయింది. ఫలితంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,95,855కి చేరింది. కరోనా బారిన పడి మరొకరు మృతిచెందారు. మొత్తం మరణాల సంఖ్య 4,043 చేరింది. తాజాగా కొవిడ్​ నుంచి మరో 351 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు 6,76,817 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,995 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులున్నాయి. మొత్తం కేసుల్లో జీహెచ్​ఎంసీ పరిధిలో 1042, మేడ్చల్​​ మల్కాజిగిరి జిల్లాలో 201, రంగారెడ్డి జిల్లాలో 147, సంగారెడ్డిలో 51 మందికి అత్యధికంగా కరోనా సోకింది.

ప్రకాశ్​కారత్‌, బృందా కారత్​కు కరోనా..

సీపీఎం పొలిట్​బ్యూరో సభ్యులు ప్రకాశ్​కారత్‌, బృందా కారత్‌లు కొవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్​లోని ఎంబీభవన్‌లో హోంఐసోలేషన్‌లో ఉన్నారు. నగరంలో జరిగిన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొన్న వీరిద్దరూ.. కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్​ నిర్ధారణ అయింది.

ఇదీచూడండి: కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్- రాత్రి 10 గంటల వరకు టీకా!

Last Updated : Jan 10, 2022, 8:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.