ETV Bharat / city

Corona Cases In Telangana: రాష్ట్రంలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 1520 కేసులు

author img

By

Published : Jan 5, 2022, 7:13 PM IST

Updated : Jan 5, 2022, 8:27 PM IST

corona
corona

19:10 January 05

రాష్ట్రంలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 1520 కేసులు

Corona Cases In Telangana: రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మూడు నాలుగు రోజుల ముందు వరకు కేవలం 200 లోపే నమోదైన కొవిడ్​ కేసులు.. రెండు రోజుల నుంచి వెయ్యికిపైగా వెలుగుచూస్తున్నాయి. ఇవాళ కొత్తగా 1,520 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,85,543కు చేరింది. కొవిడ్​ బారినపడి మరొకరు మృతిచెందారు. కరోనా మరణాల సంఖ్య 4,034కు చేరింది. 24 గంటల్లో 209 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు 6,75,341 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,168 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులిటెన్​ విడుదల చేసింది.

ఈరోజు ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 94 మంది ఒమిక్రాన్ బారినపడగా... వారిలో ఇప్పటికే 43 మంది కోలుకున్నట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

ఇదీచూడండి: 'పిల్లలు వ్యాక్సిన్​ తీసుకున్నాక ఆ పని చేయొద్దు'

Last Updated : Jan 5, 2022, 8:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.