ETV Bharat / city

TRS Party 20 Years celebrations : తెరాస 20 ఏళ్ల ప్రస్థానం: పోరాట పంథా నుంచి.. ప్రగతి పథంలోకి... - తెరాస @ 20 సంవత్సరాలు

'మఖలో పుట్టి పుబ్బలో మాయం అవుతుంది’- రెండు దశాబ్దాల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస(Telangana Rashtra Samithi Party)) ఆవిర్భవించిన తరుణంలో ఆనాటి రాజకీయ విమర్శకులు అన్న మాట ఇది! ప్రత్యేక వాదం పేరుతో దేశంలో అనేక పార్టీలు ఏర్పడ్డాయి. ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలోనూ, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ప్రముఖ నాయకులు అనేకులు పార్టీలు ఏర్పాటు చేశారు. అవి ఏవీ ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. తెరాస సైతం అలాగే కాలగర్భంలో కలిసిపోతుందని విమర్శకులు జోస్యం చెప్పారు. అందరి అంచనాలనూ అధిగమిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి నేడు ద్విదశాబ్ది ఉత్సవాలను జరుపుకొంటోంది. స్వతంత్ర భారత రాజకీయ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకుంది.

TRS Party 20 Years celebrations
TRS Party 20 Years celebrations
author img

By

Published : Oct 25, 2021, 7:35 AM IST

.

స్వాతంత్య్రానంతరం తెలుగు నేలపై ఆవిర్భవించిన రెండు పార్టీలు మాత్రమే 20 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్నాయి. అందులో ఒకటి ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం అయితే- రెండోది తెలంగాణ రాష్ట్ర సమితి(Telangana Rashtra Samithi Party). స్వరాష్ట్ర సాధన కోసం 2001 ఏప్రిల్‌లో కేసీఆర్‌(TRS president KCR) ఒక్కడిగా బయల్దేరారు. ఇప్పుడు అక్షరాలా 75 లక్షల కార్యకర్తల సైన్యం ఆయన వెంట నడుస్తోంది. జాతీయ పార్టీలుగా చెలామణీ అవుతున్న అనేక రాజకీయ పక్షాల కన్నా శాసనసభలో, పార్లమెంటులో తెరాస సంఖ్యాబలమూ ఎక్కువే! సుమారు 50 దేశాల్లో పార్టీ ఎన్‌ఆర్‌ఐ శాఖలు పనిచేస్తున్నాయి.

.

ప్రజల ఆకాంక్షలే పునాది

ప్రజల ఆకాంక్షల నుంచి తెరాస(Telangana Rashtra Samithi Party) పుట్టింది. 2001 ఏప్రిల్‌ 27న ‘జలదృశ్యం’లో పార్టీ ఆవిర్భావం సందర్భంగా, అదే ఏడాది మే 17న కరీంనగర్‌ ‘సింహగర్జన’ సభలో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తీరుతానని నాటి ఉద్యమసారథి, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్‌(Telangana CM KCR) సుస్పష్టంగా చెప్పారు. ఆ లక్ష్యం నుంచి తప్పుకొంటే రాళ్లతో కొట్టాలని ఆయనే పిలుపిచ్చారు. రాజకీయ పక్షాల్లో ఎంత మంది నాయకులు అలా చెప్పగలరు? ఆ తెగువ, ఆత్మవిశ్వాసం, చిత్తశుద్ధే తెరాసను ఇన్నేళ్లుగా నిలబెట్టాయి. కేసీఆర్‌ ఏమి చేసినా తెలంగాణ కోణంలోనే చేస్తారు. ఏ సమస్య వచ్చినా బాధితుడి వైపు నుంచే ఆలోచిస్తారు. ఆయనను సన్నిహితంగా గమనిస్తే- ‘విజేతలు విభిన్న పనులేవీ చేయరు. అందరూ చేసే వాటినే విభిన్నంగా చేస్తారు’ అన్న శివ్‌ఖేర్‌ వ్యాఖ్య వాస్తవం అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సమితి(Telangana Rashtra Samithi Party) ఉద్యమ ప్రస్థానాన్ని గమనిస్తే- కేసీఆర్‌ భిన్నమైన పంథాను ఎన్నుకున్నారు. ఉద్యమాన్ని, రాజకీయాన్ని మేళవించారు. గతంలో జరిగిన అనేక రాష్ట్రాల ఆవిర్భావాలను లోతుగా అధ్యయనం చేశారు.

1969 తెలంగాణ ఉద్యమం ఎందుకు విఫలమైందో కూలంకషంగా తెలుసుకున్నారు. వాస్తవానికి తెరాస కార్యకర్తలకు, నాయకులకు ఇవి ద్విదశాబ్ది ఉత్సవాలు(Telangana Rashtra Samithi Party 20 years celebrations)... కేసీఆర్‌కు మాత్రం 21వ వార్షికోత్సవ సంబరాలు! పార్టీ ఏర్పాటుకు ఏడాది ముందు నుంచే ఆయన సిద్ధమయ్యారు. ఉద్యమ సమయంలో తెరాస నిర్వహించిన సభలు యావద్దేశాన్ని అబ్బురపరిచాయి. వరంగల్‌ సభలకు ఆ రోజుల్లోనే 20లక్షల మందికిపైగా హాజరయ్యారు. రాష్ట్రం ఏర్పడే వరకు 14 సంవత్సరాల పాటు పార్టీ ఎన్నికల ప్రణాళికలో స్వరాష్ట్ర సాధన తప్ప మరేదీ ఉండకపోవడం విశేషం. ఉద్యమం బలహీనపడుతోందన్న విమర్శలు వచ్చినపుడు కేసీఆర్‌ తనకు తాను ప్రజాక్షేత్రంలో పరీక్ష పెట్టుకునేవారు. కరీంనగర్‌ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక మొదలు అప్పట్లో జరిగిన అనేక ఉప ఎన్నికలు... రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా చోటుచేసుకున్నవే. ఒక్క నెత్తురు చుక్క చిందించకుండా రాష్ట్రం సాధించడం మాటలు కాదు. స్వరాష్ట్రం సాకారం కాకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని కొందరు నాయకులు ప్రకటనలు ఇస్తే కేసీఆర్‌ వారించేవారు. ఇది స్వరాష్ట్రం కోసం సమరమే కానీ, వీధి పోరాటం కాదని హితవు పలికేవారు. ప్రజాస్వామిక పద్ధతిలో, పార్లమెంటులో బిల్లు పెట్టడం ద్వారా రాష్ట్రం ఏర్పాటు కావాల్సి ఉంటుందని చెప్పేవారు. అందుకే దేశంలోని 40కిపైగా రాజకీయ పార్టీలను తెలంగాణ కోసం కేసీఆర్‌ ఒప్పించారు. ఆనాటి యూపీఏ సర్కారుకు ఆ మేరకు లేఖలు అందించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి ఆర్‌ఎస్‌యూ వరకు అందరి వద్దకు వెళ్ళారు. కేంద్రంలో శాఖ లేని మంత్రిగా ఉన్నారు. నిరసన తెలపాల్సి వస్తే శాంతియుత మార్గాన్నే ఎన్నుకున్నారు. తానే ఆమరణ దీక్షకు పూనుకొన్నారు. శాంతియుతంగానే రాష్ట్రం సాధించారు. సడక్‌ బంద్‌, వంటావార్పు, సకల జనుల సమ్మె... ఇలా ఏం చేసినా శాంతియుతమే.

.

రాష్ట్రం(Telangana state) ఏర్పాటైన తరవాతా శాంతిభద్రతలకే కేసీఆర్‌ తొలి ప్రాధాన్యమిచ్చారు. తెలంగాణలో నివసిస్తున్న ప్రతీ ఒక్కరు ఈ గడ్డబిడ్డలే అని ముఖ్యమంత్రి హోదాలో ఉద్ఘాటించారు. కరోనా ఆపత్కాలంలో ఇతర రాష్ట్రాల వారినీ ఇతోధికంగా అక్కునచేర్చుకున్న మానవీయ ప్రభుత్వం ఇక్కడ ఉంది. తెలంగాణ ఏర్పడ్డాక ఈ ఏడేళ్లలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే ఒక్క సంఘటన కూడా జరగలేదు. తెలంగాణ ఉద్యమ నినాదం- నీళ్లు, నిధులు, నియామకాలు. ప్రజలు వాటి కోసమే పోరాడారు. అందుకే రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే ఆ అంశాలకు కేసీఆర్‌ అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. కాళేశ్వరం జలాలతో తెలంగాణ రైతులను ఆనందభరితులను చేశారు. లక్షా 32వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారు. ప్రైవేటు రంగంలో 16 లక్షల ఉద్యోగాలను కల్పించారు. ప్రపంచవ్యాప్త పారిశ్రామికవేత్తలకు ఇప్పుడు తెలంగాణ ఒక గమ్యస్థానంగా మారింది. ఆర్థిక క్రమశిక్షణలో దేశంలోనే అత్యత్తుమ రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇది ఆషామాషీ ఘనత కాదు. ఏ ప్రభుత్వ పనితీరుకైనా ప్రజామోదమే కొలమానం. 2014లో 63 సీట్లను గెలుచుకున్న తెరాస, 2018 ఎన్నికల్లో 88 స్థానాలు నెగ్గింది. పార్టీ, ప్రభుత్వ పనితీరుకు దక్కిన ప్రజామోదానికి ఇది నిదర్శనం.

స్వీయ అస్తిత్వమే శ్రీరామరక్ష

జోగినపల్లి సంతోశ్ కుమార్

తెలంగాణ రాష్ట్రానికి స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష. ఇక్కడి ప్రజల, ప్రాంత సమస్యలు తీరాలంటే స్థానిక పార్టీ వల్లే సాధ్యమవుతుంది. తెరాస అనేక కుట్రలను, కుతంత్రాలను ఎదుర్కొని నిలబడింది. పార్టీ నాయకత్వం, కార్యకర్తలు అనేక పోరాటాలతో రాటుతేలారు. రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో అది కీలక పాత్ర పోషించడం ఖాయం. దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. తమిళనాడులో డీఎంకే, పశ్చిమ్‌ బంగలో టీఎంసీ, మహారాష్ట్రలో ఎన్సీపీ-శివసేన, ఒడిశాలో బీజేడీ, ఏపీలో వైకాపా... ఇలా అనేక రాష్ట్రాల్లో అవే అధికారంలో ఉన్నాయి. కేంద్రంలో సమాఖ్య స్ఫూర్తి ఉండాలని, జాతీయ పార్టీల అనవసర పెత్తనం తమపై ఉండవద్దని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో 17 లోక్‌సభ, ఏడు రాజ్యసభ స్థానాలున్నాయి. తెరాసకు లోక్‌సభలో తొమ్మిది మంది, రాజ్యసభలో ఏడుగురు సభ్యులున్నారు. మొత్తంగా 16 మందితో దేశంలో అత్యధిక చట్టసభ సభ్యులు ఉన్న పది రాజకీయ పక్షాల్లో తెరాస ఒకటిగా ఆవిర్భవించింది. ఇటీవలే దిల్లీలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసుకుంది. అతిత్వరలోనే దేశ రాజధానిలో తెలంగాణ ప్రజలకు తమకంటూ ఒక ప్రత్యేక కేంద్రం రాబోతోంది. ద్విదశాబ్ది ప్రస్థానాన్ని దిగ్విజయంగా పూర్తిచేసుకున్న తెరాస... తన మూలాలను ఎప్పటికీ మరువదు. ‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయస సంత్రస్తులై...’ అన్న భర్తృహరి సుభాషితాన్ని మా నాయకుడు కేసీఆర్‌ తరచూ గుర్తుచేస్తారు. ఏదైనా పని ప్రారంభించినప్పుడు దాన్ని విజయవంతంగా ముగించే వరకు ఆయన నిద్రపోరు. ‘కొసదాక కొట్లాడేటోడే సిపాయి’ అని చెబుతుంటారు. తెరాసను దేశానికే ఆదర్శప్రాయ రాజకీయ పక్షంగా తీర్చిదిద్దాలన్నది ఆయన ఆశయం. దేశ రాజకీయాల్లో ఇప్పటికే తనదైన ముద్ర వేసిన తెలంగాణ రాష్ట్ర సమితి... భవిష్యత్తులో మరింత ప్రబల శక్తిగా ఎదుగుతుందని ఆశిద్దాం.

ఆదర్శప్రాయ పథకాలు

మిషన్ భగీరథ

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు- ప్రజల కోణంలో ఆలోచించి అమలులోకి తెచ్చినవే. అందులో ఆసరా, రైతుబంధు, దళితబంధు, విద్యార్థులకు విదేశీనిధి పథకం వంటివి అనేకం ఉన్నాయి. తెలంగాణ పథకాలను దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వాలు అధ్యయనం చేయడంతో పాటు తమతమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి. రైతుబంధు, మిషన్‌ భగీరథ వంటి వాటిని కేంద్ర ప్రభుత్వం సైతం అందిపుచ్చుకొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.