ETV Bharat / city

రైతులకు పంట రుణాలు పంపిణీ చేయాలి: రైతు సంఘాలు - పంట రుణాలు పంపిణీ చేయాలంటూ ధర్నా

రైతులకు పంట రుణాలు పంపిణీ చేయాలని డిమాండ్​ చేస్తూ... తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నాబార్డ్​ ప్రాంతీయ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. రుణ ప్రణాళిక ఖరారు చేసి, స్కేల్​ ఆఫ్​ ఫైనాన్స్​ ప్రకారం రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

telangana raithu sangam protest at nabard regional office in rtc cross roads
రైతులకు పంట రుణాలు పంపిణీ చేయాలి: రైతు సంఘాలు
author img

By

Published : Jul 6, 2020, 4:28 PM IST

రాష్ట్రంలో రైతులందరికీ పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... హైదరాబాద్​లో తెలంగాణ రైతు సంఘం ఆందోళన చేపట్టింది. ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద నాబార్డ్ తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 36 రోజులు గడుస్తున్నప్పటికీ... ఇంత వరకు రుణ ప్రణాళిక ఖరారు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ నగరంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి-ఎస్ఎల్బీసీ సమావేశం జరుగుతున్న వేళ... తమ నిరసన వ్యక్తం చేశారు.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, కంది, ఇతర పంటల సాగు విస్తీర్ణం పూర్తయినందున.. ఏకకాలంలో రుణమాఫీ చేసి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇవ్వాలని అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. తక్షణమే రాష్ట్ర రుణ ప్రణాళిక ఆమోదించి ప్రభుత్వం బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు.

వానా కాలం ప్రారంభమై నెల రోజులు గడిచినా.. ముఖ్యమంత్రి పంట రుణాల పంపిణీపై దృష్టి సారించకపోతే ఎలా అని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ ప్రశ్నించారు. ఈ ఏడాది రూ.60 వేల కోట్లు రుణాలు పంపిణీ చేయాల్సి ఉన్నందున.. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం 10 శాతం పెంచి రుణాలు ఇవ్వాలని కోరారు. తక్షణమే కొత్త రుణాలు ఇవ్వకపోతే.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్కామని తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి తీగల సాగర్ హెచ్చరించారు.

రైతులకు పంట రుణాలు పంపిణీ చేయాలి: రైతు సంఘాలు

ఇదీ చూడండి: చైనా విదేశాంగ మంత్రితో డోభాల్​​ చర్చలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.