ETV Bharat / city

లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయాలు.. రేపటి నుంచే అమలు - telangana dgp latest news

రాష్ట్రమంతా లాక్‌డౌన్‌ అమలవుతోన్న తీరుపై డీజీపీ మహేందర్‌రెడ్డి సమీక్షించారు. రోడ్లపైకి అనవసరంగా వచ్చే వాహనదారుల నియంత్రణపై నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. వాహనదారుల పాసులు, వ్యక్తిగత పాసులు, నిత్యావసరాల అందుబాటు, కాలనీల్లోనూ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు మూసివేతతో పాటు అనేక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటన్నింటిని రేపటి నుంచే అమలు చేస్తామని ప్రకటించారు.

telangana police
పోలీసు శాఖ కీలక నిర్ణయాలు.
author img

By

Published : Apr 20, 2020, 7:40 PM IST

పోలీసు శాఖ కీలక నిర్ణయాలు.. రేపటి నుంచి అమలు

అత్యవసర సరకుల సరఫరాకు కొందరికి పాసులు ఇచ్చాం. వాహనదారులకు ఇచ్చిన పాసులపై సమీక్షించాలని నిర్ణయించాం. అవసరం లేకున్నా వాహనదారులు పాసులతో రోడ్లపైకి వస్తున్నారు. ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారుల పాసులను రద్దు చేస్తాం. పాసులు కలిగిన వ్యక్తి తిరగాల్సిన ప్రదేశాలను గుర్తిస్తాం. పాసు కలిగిన వ్యక్తి ఏ సమయానికి ఏ మార్గంలో వెళ్లాలనే విషయం గుర్తిస్తాం. కొత్త పాసులు ఇచ్చేవరకూ పాత పాసులు కొనసాగుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు పాసులు ఇస్తాం. వారంలో ఆరు రోజులకు ఆరు రంగుల పాసులు జారీ చేస్తాం. కలర్‌ కోడ్‌ ప్రకారం సంస్థలు ఉద్యోగులకు పాసులు ఇవ్వాలి. - మహేందర్‌రెడ్డి , డీజీపీ

రెసిడెన్స్‌ ప్రూఫ్‌ తప్పనిసరి..

నిత్యావసరాల కొనుగోలుకు 3 కి.మీలోపు మాత్రమే వెళ్లాలని డీజీపీ తెలిపారు. వాహనదారులు రెసిడెన్స్‌ ప్రూఫ్‌తోనే బయటకు రావాలని సుచించారు. ఆస్పత్రులకు వెళ్లేవారు కూడా రెసిడెన్స్‌ ప్రూఫ్‌ తీసుకురావాలన్నారు. సాధారణ జబ్బుల చికిత్సకు సమీప ఆస్పత్రులకు వెళ్లాలని పేర్కొన్నారు. తీవ్ర ఆరోగ్య సమస్య ఉండి దూరం వెళ్తే రిఫరెన్స్‌ పత్రాలు తేవాలిని చెప్పారు. సమర్థంగా లాక్‌డౌన్‌ అమలుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని ఆశించారు.

1.21 లక్షల వాహనాలు సీజ్‌..

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1.21 లక్షల వాహనాలు సీజ్‌ చేశామని డీజీపీ తెలిపారు. లాక్‌డౌన్‌ పూర్తయ్యాక వాహనాలు కోర్టులో డిపాజిట్‌ చేస్తామన్నారు. కోర్టు ద్వారానే వాహనాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రేషన్‌ దుకాణాలు, బ్యాంకుల వద్ద భౌతిక దూరం పాటించాలన్నారు. ఆహార పంపిణీ చేసేవారు భౌతిక దూరం పాటించే బాధ్యత తీసుకోవాలని హితవు పలికారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలు సీజ్‌ చేస్తామని డీజీపీ హెచ్చరించారు.

మార్గాలు మూసివేత..

కాలనీల్లోనూ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు మూసివేయాలని డీజీపీ ఆదేశించారు. ప్రజలు బయటకు రాకుండా రెసిడెన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు చూడాలన్నారు. రాత్రి కూడా కర్ఫ్యూ అమలవుతుందని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో 320కి పైగా కంటైన్‌మెంట్‌ జోన్లు ఉన్నాయని తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దులు మూసి కరోనా కట్టడికి కృషి చేస్తున్నామన్నారు.

అద్దె చెల్లింపులపై..

అద్దె చెల్లించాలని ఇంటి యజమానులు ఒత్తిడి తేవొద్దని సీఎం చెప్పిన విషయాన్ని డీజీపీ గుర్తు చేశారు. అద్దె చెల్లింపులపై 36 ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని వెల్లడించారు. యజమానులకు పోలీసులు సర్దిచెప్పారని వివరించారు. ఇంటి యజమానులు వినకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కరోనా కట్టడి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని డీజీపీ తెలిపారు. కరోనా కనుమరుగయ్యే వరకు పోలీసులు అంకితభావంతో పనిచేయాలన్నారు. పోలీసుశాఖకు ప్రోత్సాహకం ప్రకటించిన ప్రభుత్వానికి డీజీపీ ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి: తలసేమియా రోగులకు రక్తమార్పిడి చేస్తేనే బతుకుతారు: మంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.