ETV Bharat / city

మూడు కిలోమీటర్లు దాటితే పట్టేస్తోంది.. జాగ్రత్త - వాహనాల తనిఖీకి మొబైల్ యాప్

కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న పకడ్బందీ చర్యలకు కొందరు తూట్లు పొడుస్తున్నారు. అవసరం లేకున్నా రోడ్లమీదికొస్తూ... లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. సాంకేతికతను ఉపయోగించుకొని వాహనదారులపై నియంత్రణ చర్యలకు పోలీసు శాఖ ఉపక్రమించింది. ఆటోమెటిక్ పర్సన్ ఐడెంటిఫికేషన్ సిస్టం పేరిట మొబైల్‌ అప్లికేషన్‌ను రూపొందించి ఆచరణలోకి తెచ్చింది.

mobile app for vehicle cheching
మూడు కిలోమీటర్లు దాటితే పట్టేస్తోంది.. జాగ్రత్త
author img

By

Published : Apr 10, 2020, 6:21 AM IST

కరోనాను అరికట్టడానికి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. ప్రజలెవరూ బయటికి రాకుండా ఇళ్లకే పరిమితం కావాలని ప్రకటించింది. ఉదయం 6 నుంచి రాత్రి 7గంటల వరకు లాక్‌డౌన్... రాత్రి 7నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఉదయం వేళ మాత్రమే నిత్యావసరాలు, అత్యావసరాల కోసం వాహనదారులు రోడ్డు మీదకు రావాలని సూచిస్తున్నారు. వారు కూడా వ్యక్తులు తాము నివసించే ప్రాంతం నుంచి గరిష్ఠంగా 3 కిలోమీటర్ల లోపే వెళ్లాలి. ద్విచక్రవాహనంపై ఒకరు, కారులో ఇద్దరు మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఉంది.

పని లేకున్నా బయటకొస్తున్నారు..!

అత్యవసర పరిస్థితిలో వెళ్లే వాళ్లు దానికి సంబంధించిన ధ్రువపత్రాలను చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వాహనదారులు ఇష్టారీతిన బయటికి వస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రోజుకు దాదాపు 15వేల వాహనాలు రహదారులపైకి వస్తున్నాయి. ఇందులో ద్విచక్రవాహనాలే 13వేల వరకు ఉంటున్నాయి. కార్లలోనూ బయటికి వచ్చి రహదారులపై తిరుగుతున్నారు. ఇలాంటి వారిని గుర్తించడానికి ట్రాఫిక్ పోలీసులు ఆటోమెటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇలాంటి కెమెరాలు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 250 వరకు ఉన్నాయి. రోడ్లపై వాహనాలు ఎక్కువగా వస్తుంన్నందున... అలాంటి వారిపై చర్యలకు పోలీసులు ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులను గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు.

ఇలా పనిచేస్తోంది..

పోలీసుశాఖ ఆటోమెటిక్ పర్సన్ ఐడెంటిఫికేషన్ సిస్టం పేరుతో యాప్‌ను అభివృద్ధి చేసింది. లాక్‌డౌన్ సందర్భంగా నగరంలోని పలు చోట్ల తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రహదారిపైకి వచ్చిన వాహనదారుడి వివరాలను పోలీసులు... తమ వద్ద ఉన్న చరవాణిలో నమోదు చేస్తున్నారు. సదరు వాహనదారుడు అక్కడి నుంచి ముందుకు వెళ్లాక... మరో తనిఖీ కేంద్రంలో తారసపడితే గనక... అక్కడ కూడా పోలీసులు వాహనదారుడి వివరాలు యాప్‌లో నమోదు చేస్తారు. ఒకవేళ వాహనదారుడు 3 కిలోమీటర్లు దాటి ప్రయాణిస్తే... జీపీఎస్ ద్వారా వెంటనే తెలిసిపోతుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వాహనం స్వాధీనం చేసుకుంటున్నారు. గత రెండు రోజులుగా పోలీసులు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వందల సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నారు.

ఇదీ చూడండి: తెలంగాణలో 471కి చేరిన కరోనా పాజిటివ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.