ETV Bharat / city

కొత్త పంథాల్లో సైబర్ నేరాలు.. పట్టుకునేందుకు పోలీసుల టెక్నిక్​లు - telangana cyber criminals

తెలంగాణ రాష్ట్రంలో సైబర్‌ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్న దృష్ట్యా.. మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తామిచ్చే జాగ్రత్తలు, సూచనలు, సలహాలు పాటిస్తే మొబైల్‌లో సమాచారం సురక్షితంగా ఉంటుందని స్పస్టం చేశారు. సెల్‌ఫోన్‌లో బ్లూటూత్‌, ఇంటర్నెట్‌ అవసరమైనప్పుడు మాత్రమే ఆన్‌ చేయాలని, నిరంతరం ఆన్‌లో ఉంచొద్దని హెచ్చరించారు.

cyber crime, cyber crimes in telangana, telangana cyber crime
సైబర్ క్రైమ్, తెలంగాణలో సైబర్ క్రైమ్, తెలంగాణ సైబర్ నేరస్థులు
author img

By

Published : May 2, 2021, 12:26 PM IST

సైబర్‌ నేరస్థులు.. కొత్త కొత్త ఎత్తులతో ప్రజలను మోసగిస్తున్నారు. బ్యాంకు ఖాతాల వివరాలను చోరీ చేయడం, వ్యక్తిగత సమాచారం తస్కరించడం ద్వారా ప్రజల ఖాతాల్లోని సొమ్మును కొళ్లగొడుతున్నారు. క్రెడిట్‌కార్డు, డెబిట్‌కార్డు ఓటీపీలు చెప్పించుకొని తద్వారా ఖాతాల్లో సొమ్ము మాయం చేస్తున్నారు. బ్యాంకర్ల అవతారమెత్తి.. ఖాతాలను అప్‌డేట్‌ చేసుకోవాలని, పాన్‌కార్డు అనుసంధానమని, ఆధార్‌కార్డు అనుసంధానమని మాటలు కలిపి వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాకింగ్‌ వివరాలను.. దోచేస్తున్నారు. మొబైల్‌ ఫోన్‌లను హ్యాక్‌ చేసి తద్వారా బ్యాంకు సంబంధిత వివరాలను తస్కరిస్తున్నారు.

గైడ్​లైన్స్

ప్రపంచ వ్యాప్తంగా, జాతీయ స్థాయిలో మంచి పేరున్న కంపెనీలు, సంస్థలకు చెందిన నకిలీ లింకులను మొబైల్‌కు మెసేజ్‌ చేయడం, ఈ-మెయిల్‌కు పంపడం.. వాటిని తెరిచి అడిగిన వివరాలు నమోదు చేయగానే ఖాతాదారుడి బ్యాంకు సంబంధ, వ్యక్తిగత సమాచారం అంతా కాపీ చేసుకుని తద్వారా మోసాలకు ఒడిగడుతున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని మొబైల్‌ ఫోన్‌లను సురక్షితంగా ఉంచుకోడానికి అనుసరించాల్సిన కొన్ని సూచనలను,​ సలహాలను సైబరాబాద్‌ పోలీసులు సిద్దం చేశారు.

సాఫ్ట్​వేర్ అప్​డేట్ ముఖ్యం

తరచూ ఫోన్‌ సాప్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసుకుంటూ ఉండాలని, ఆంటీ వైరస్‌ ఇన్​స్టాల్‌ చేసుకుని ఎప్పటికప్పుడు దాన్ని అప్‌డేట్‌ చేసుకోవాలని చెబుతున్నారు. బ్యాంకింగ్‌కు చెందిన వ్యక్తిగత సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్‌లో నిల్వ ఉంచరాదని స్పస్టం చేస్తున్నారు. సామాజిక నెట్‌వర్క్‌ ద్వారా.. కొత్తవారితో, అనుమానితులతో పరిచయాలు పెంచుకోవద్దని సూచించారు.

జియో ట్యాగింగ్ ఫీచర్​

జియో ట్యాగింగ్‌ ఫీచర్‌ను మొబైట్‌లో ఆఫ్‌లో ఉంచుకోవాలని, ఎక్కడైనా పబ్లిక్‌ వైఫై కనెక్ట్‌ అయినా వెబ్‌సైట్‌లను యాక్సిస్‌ చేయవద్దని హెచ్చరిస్తున్నారు. అవసరమైతేనే పాస్‌వర్డ్, క్రెడిట్‌ కార్డు ఇన్‌ఫర్మేషన్‌ నమోదు చేయాలన్నారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేటప్పుడు, బ్యాంకింగ్‌ సేవలు వినియోగించుకునే ముందు హెచ్‌టిటిపి ఒకసారి చూసుకోవాలని అంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.