ETV Bharat / city

తెలంగాణలో నేరం చేస్తే.. తప్పించుకోవడం కష్టమే సుమా! - automated number plate recognition system in telangana policing

చేతిలో లాఠీ...నడుముకి తుపాకీ. సంప్రదాయ పోలీసుల ఆయుధాలు ఇవే. ఇప్పుడు వాటి స్థానంలో సాంకేతిక అస్త్రాలు చేరాయి. సమయానుకూలంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా శాస్త్రీయ పరిజ్ఞానాన్ని వివిధ రూపాల్లో అందిపుచ్చుకుంటున్న తెలంగాణ పోలీస్‌శాఖ ఈ విషయంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది.

telangana police are quick in solving cases with the help of technology
తెలంగాణ పోలీసు శాఖ
author img

By

Published : Jan 26, 2021, 6:39 AM IST

శాంతి భద్రతల పరిరక్షణతోపాటు మహిళల రక్షణకు మేమున్నామనే భరోసా ఇస్తోంది తెలంగాణ పోలీసు శాఖ. ఎలాంటి క్లిష్టమైన కేసులనైనా ఇట్టే ఛేదిస్తూ, నేరగాళ్లు ఎక్కడున్నా పట్టేస్తూ వారి పాలిట సింహస్వప్నమైంది. తెలంగాణ పరిధిలో నేరం చేస్తే తప్పించుకోవడం కష్టమే సుమా! అని నేరస్థులు భావించే స్థాయిలో పోలీసింగ్‌లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయంటే అతిశయోక్తి కాదు. అందులో ఒకటైన ‘టీఎస్‌కాప్‌’ యాప్‌ నేరస్థులకు సంబంధించిన సకల సమాచారాన్ని వేలికొనలపైకి తెచ్చి ఇప్పటికే అనేక అవార్డులు అందుకుంది. హాక్‌ఐ యాప్‌, ఆటోమేటెడ్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నైజేషన్‌ (ఎ.ఎన్‌.పి.ఆర్‌) సిస్టం, పాపిలోన్‌, దర్పణ్‌ వంటి సాఫ్ట్‌వేర్‌లు పోలీసింగ్‌కు కొత్త అర్థం చెబుతున్నాయి.

నేరం జరగకుండా నివారించడంలో.... జరిగిన నేరానికి కారకులు ఎవరో పట్టుకోవడంలో పోలీసులకు సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతోంది. అటువంటి సాంకేతిక పరిజ్ఞానాల్లో కొన్ని...

వేషం మార్చినా ‘దర్పణ్‌’ పట్టేస్తుంది

ముఖ కవళికల ఆధారంగా వ్యక్తుల్ని శాస్త్రీయంగా గుర్తించే అద్భుత ఆయుధాన్ని తెలంగాణ పోలీసులు రూపొందించారు. ఫేషియల్‌ రికగ్నైజేషన్‌గా పేర్కొనే ఆ సాఫ్ట్‌వేర్‌ పేరే దర్పణ్‌. ఎవరైనా దుండగుడు/నేరగాడు వేషం మార్చి తిరుగుతున్నా, అనుమానాస్పదంగా కన్పించినా అతని ఫొటో తీసి దర్పణ్‌ యాప్‌లో నిక్షిప్తం చేస్తే చాలు, అది అందులో ఉన్న పాత నిందితుల డేటాబేస్‌తో సరిపోలుస్తుంది. ఎన్ని రకాలుగా వేషం మార్చినా ఈ యాప్‌ రెండు ఫొటోల మధ్య ఉన్న సారూప్యతలను పసిగడుతుంది. ప్రధానంగా తప్పించుకు తిరుగుతున్న నేరస్థులను పట్టుకోవడం కోసం రూపొందించిన ఈ పరిజ్ఞానాన్ని తప్పిపోయిన పిల్లల్ని గుర్తించేందుకు విరివిగా వాడుతున్నారు. ఇప్పటి వరకూ 33 మంది తప్పిపోయిన పిల్లల్ని గుర్తించారు. దేశవ్యాప్తంగా తప్పిపోయిన పిల్లల ఫొటోలను ఆయా పోలీస్‌ స్టేషన్ల వారీగా సేకరించి, వాటిని వివిధ సంరక్షణ గృహాల్లో ఉన్న వారితో సరిపోల్చుతున్నారు. తప్పిపోయిన వారిలో ఎవరైనా ఈ గృహాల్లో ఆశ్రయం పొందుతుంటే గుర్తించి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తున్నారు.

ఆటోమేటెడ్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నైజేషన్‌ (ఎ.ఎన్‌.పి.ఆర్‌) సిస్టం

వాహనం మూడు వందల కిలోమీటర్ల వేగంతో వెళుతున్నా, వెలుతురు సరిగా లేకపోయినా దాని నంబరు ప్లేటును గుర్తించేందుకు వీలుగా ఆటోమేటెడ్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నైజేషన్‌ (ఎ.ఎన్‌.పి.ఆర్‌) వ్యవస్థను తెలంగాణ పోలీసులు సిద్ధంచేశారు. మామూలు సీసీ కెమెరాలతోపాటు కీలకమైన ప్రాంతాల్లో ఈ ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ ఉన్న కెమెరాలను అమర్చారు. రవాణాశాఖ వద్ద ఉన్న సమాచారంతో ఇది అనుసంధానమై ఉండటంతో వాహనంలో ఉన్న యజమాని చిరునామా కూడా కంట్రోల్‌ రూంలో తెలిసిపోతుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిన సందర్భాల్లో నిందితులను పట్టుకునేందుకు ఈ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

నేరస్థుల పాలిట సింహస్వప్నం ‘పాపిలోన్‌’

లక్షలాది వేలిముద్రలను క్షణాల్లో వడపోసే మరో అద్భుత పరిజ్ఞానమే పాపిలోన్‌. ఏదైనా నేరం జరిగినప్పుడు అక్కడ సేకరించే వేలిముద్రలను, తమ వద్ద ఉన్న పాత నేరస్థుల వేలిముద్రలతో సరిపోల్చడం ద్వారా పోలీసులు నేరస్థులను గుర్తిస్తారు. ఒకప్పుడు ఇదంతా మనుషులే చేసేవారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు తొమ్మిది లక్షల వేలిముద్రలు ఉన్న నేపథ్యంలో ఈ ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉండేది. దీన్ని మరింత సులభతరం చేయడంతోపాటు కచ్చితత్వాన్ని జోడించేందుకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే వేలిముద్రలను వడపోసేందుకు ‘ఫాక్ట్‌’ పేరుతో ఒక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రూ.2 కోట్లు ఖర్చుపెట్టి పాపిలోన్‌ సాఫ్ట్‌వేర్‌ను సమకూర్చుకున్నారు. లక్షలాది వేలిముద్రలను ఇది క్షణాల్లోనే వడపోస్తుంది. దీని సాయంతో ఇప్పటివరకూ 14 వేల మందిని పట్టుకున్నారు.

‘హాక్‌ఐ’..అదో ‘యాప్‌’త రక్షకి..

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తెలంగాణ పోలీసులు రూపొందించిన అద్భుతమైన పరిజ్ఞానంలో ‘హాక్‌ఐ’ ఒకటి. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న వారు అత్యవసర సమయంలో స్పందించే, తమకు అత్యంత సన్నిహితులైన ఐదుగురి పేర్లను ఎస్‌.ఒ.ఎస్‌(సేవ్‌ అవర్‌ సోల్‌)కు అనుసంధానం చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు మొబైల్‌లోని ఈ మీట నొక్కగానే ‘నేను ఆపదలో ఉన్నాను’ అనే సందేశం ఆ ఐదుగురికీ వెళుతుంది. అదే సమయంలోనే సంబంధిత వ్యక్తి ఏ ప్రదేశంలో ఉన్నారో తెలిపే సమాచారం దాని పరిధిలోని పోలీస్‌స్టేషన్‌కు, సంబంధిత అధికార్లకూ సందేశం రూపంలో చేరుతుంది. బాధితులు ఉన్న ప్రాంతానికి గస్తీ పోలీసులు వచ్చేందుకు వీలుగా దారి కూడా చూపుతుంది. దీనికి ఇంటర్నెట్‌ ఉండాల్సిన అవసరం లేదు. దీంతోపాటు ఈ యాప్‌లో అనేక ప్రయోజనకరమైన అంశాలనూ పొందుపరిచారు. అందులో ఒకటైన ఉమెన్‌ట్రావెల్‌ మేడ్‌ సేఫ్‌ చిహ్నం నొక్కితే చాలు.. వారు ప్రయాణించే ఆటో, క్యాబ్‌ల ప్రయాణ మార్గాన్ని మ్యాప్‌ద్వారా పోలీసులు గమనించొచ్చు. మధ్యలో ప్రయాణానికి ఆటంకం కలిగితే కమాండ్‌ కంట్రోల్‌ రూం సిబ్బంది సమీపంలోని పోలీసులను అప్రమత్తం చేస్తారు. రోడ్డుమీద ఎవరైనా అడ్డదిడ్డంగా వాహనాలు నిలిపినా ఫొటో తీసి ఈ యాప్‌ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వవచ్చు.

‘టీఎస్‌కాప్‌’ యాప్‌.. వేలి కొనల్లో నేరస్థుల చరిత్ర

సమాచారమే ఆయుధంగా మారిన ఈ రోజుల్లో శాంతిభద్రతల పరిరక్షణ విధుల్లో ఉన్న పోలీసులకు కావాల్సిన సమాచారాన్ని, అవసరమైనప్పుడు వేగంగా అందించగలిగేలా రూపొందించిందే ‘టీఎస్‌కాప్‌’ యాప్‌. ఇది పోలీసు నెట్‌వర్క్‌తో అనుసంధానమై ఉంటుంది. రాష్ట్రంలో నమోదైన కేసులకు సంబంధించిన వివరాలను ఈ యాప్‌ ద్వారా ఎక్కణ్నుంచయినా చూసుకునే వీలుంటుంది. క్రైం అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ (సీసీటీఎన్‌ఎస్‌) ద్వారా దేశవ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్లను అంతర్జాలంతో అనుసంధానం చేసిన కారణంగా రాష్ట్రంలోని పోలీసులెవరైనా యాప్‌ ద్వారా ఇతర రాష్ట్రాలకు చెందిన నేరస్థులు, నేరాలకు సంబంధించిన వివరాలను చూడవచ్చు. నేరాలు జరిగే ప్రదేశాలు, సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్‌ టవర్ల వంటి వాటి సమాచారాన్ని జియోట్యాగింగ్‌ చేసి సర్వర్‌లో నిక్షిప్తం చేసి ఉండటంతో ఈ వివరాలూ తెలుసుకునే వీలుంది. పేరు, ఫోన్‌ నంబరు, పాన్‌కార్డు నంబరు వంటివి యాప్‌లో నమోదు చేస్తే అనుమానితుడు ఎవరు? ఎక్కడున్నాడు? వంటి వివరాలను అత్యంత వేగంగా తెలుసుకోవచ్చు.

* రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు అక్కడికి సమీపంలో ఉన్న అంబులెన్సులు, ఆసుపత్రుల వివరాలూ ఈ యాప్‌లో కన్పిస్తాయి.

* సిబ్బంది పనితీరునూ ఇది విశ్లేషిస్తుంది. దీని ఆధారంగానే పదోన్నతులు, పోస్టింగులిస్తారు.

మీట నొక్కితే పోలీసులు చుట్టుముడతారు

ల్లరి మూకలు దుకాణాలపై దాడులు చేస్తున్నారనే సమాచారం వచ్చింది. గస్తీ వాహనంలో నలుగురు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న వందలాది మంది ఆందోళనకారులు పోలీసులపై రాళ్లదాడి మొదలుపెట్టారు. నలుగురుం వారిని కట్టడి చేయలేమని గుర్తించిన పోలీసులు వెంటనే తమ చేతిలో ఉన్న ట్యాబ్‌లో ఓ మీట నొక్కారు. నిముషాల్లోనే పదుల సంఖ్యలో పోలీస్‌ వాహనాలు అక్కడికి చేరుకున్నాయి.

ఎలా సాధ్యమైంది

పోలీసు వాహనాలన్నింటినీ జీపీఎస్‌ ద్వారా టీఎస్‌ కాప్‌కు అనుసంధానం చేశారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న పోలీసులు ఆ యాప్‌లో అత్యవసర మీట నొక్కగానే, అక్కడికి సమీపంలో ఉన్న మిగతా పోలీసు వాహనాలన్నింటికీ మరుక్షణమే సమాచారం చేరుతుంది. అంతేకాదు. ఆపదలో ఉన్న వారి వద్దకు వెళ్లేందుకు మ్యాప్‌ ద్వారా దారి కూడా అదే చూపిస్తుంది.

ఢీకొట్టి ఇంటికెళ్లేలోపే పోలీసులు అక్కడున్నారు

మూణ్నెల్ల క్రితం పంజాగుట్ట వద్ద మితిమీరిన వేగంతో వచ్చిన కారు పాదచారులను ఢీకొట్టి క్షణాల్లో మాయమైంది. ప్రమాదానికి కారణమైన కారు యజమాని జుబ్లీహిల్స్‌లో తన ఇంటికి వెళ్లాడు. అప్పటికే అక్కడ అతని కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.

ఎలా సాధ్యమైంది

ప్రమాదం జరిగినప్పుడు అక్కడున్న ఓ వ్యక్తి కారు నంబరు నమోదు చేశాడు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులకు ఇచ్చాడు. వారు తమ ట్యాబ్‌లోని టీఎస్‌కాప్‌ యాప్‌లో దాన్ని నమోదు చేయగానే ఆటోమేటెడ్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నైజేషన్‌ సిస్టం కారు యజమాని ఎవరు? చిరునామా ఏమిటి? అనే వివరాలు తెలిపింది. ఆ సమాచారాన్ని వారు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఇవ్వడంతో వారు ప్రమాదానికి కారణమైన వ్యక్తి ఇంటికి వెళ్లేలోపే అక్కడికి చేరుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.