ETV Bharat / city

Telangana News Today టాప్​న్యూస్ 3PM - telangana news today

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

3PM TOPNEWS
3PM TOPNEWS
author img

By

Published : Aug 16, 2022, 2:58 PM IST

జమ్ముకశ్మీర్​లో భద్రతా బలగాల వాహనం నదిలో పడిపోగా ఆరుగురు జవాన్లు మృతి చెందారు. 30 మంది సైనికులు గాయాలపాలయ్యారు.

  • ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్లేందుకు పాదయాత్రన్న బండి సంజయ్

జనగామ జిల్లాలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగుతోంది. పాలకుర్తి మండలంలో 16 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు. నేటితో వెయ్యి కిలోమీటర్ల పూర్తవుతున్న సందర్భంలో బండి సంజయ్‌తో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి.

  • హైదరాబాద్‌ మెట్రోలో విద్యార్థుల జాయ్ రైడ్

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ.. విద్యార్థులతో జాయ్ రైడ్ నిర్వహించింది. అమీర్‌పేట్ నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ వరకు నిర్వహించిన ఈ జాయ్ రైడ్‌లో సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు మెట్రో అధికారులు కూడా పాల్గొన్నారు.

  • ఆ సమయానికి రెడ్‌ సిగ్నల్‌ పడి జనగణమన గీతం వచ్చేలా ప్రోగ్రామింగ్

స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. పదకొండున్నరకు ఎక్కడివారు అక్కడే నిల్చొని జాతీయగీతం ఆలపించారు. హైదరాబాద్​ పరిధిలో ఆన్‌లైన్‌లో అనుసంధానమైన కూడళ్ల వద్ద రెడ్‌ సిగ్నల్‌ పడి జాతీయ గీతం వచ్చేలా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ప్రోగ్రాం చేశారు.

  • తేళ్లతో దేవుడికి నైవేద్యం పెట్టే వింత ఆచారం, ఎక్కడో తెలుసా

ఎక్కడైనా దేవుడికి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకుంటారు. ఇంకా అయితే ప్రీతిపాత్రమైన ఫలహారాన్నివండి దేవుడికి నైవేద్యం పెడతారు. ఆ ప్రాంతంలో మాత్రం తేళ్లను పట్టుకుని నైవేద్యంగా సమర్పిస్తారు. పెద్దలే కాదు చిన్నపిల్లలు సైతం తేళ్లను భయంలేకుండా పట్టుకుంటారు.

  • భారత్​ అభ్యంతరాలు బేఖాతరు, శ్రీలంకకు చైనా నిఘా నౌక

భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా చైనా నిఘా నౌక యూవాన్​ వాంగ్​ శ్రీలంక చేరుకుంది. దక్షిణ ప్రాంతంలోని హంబన్‌టొట పోర్టులో నౌకను మోహరించారు. ఈ విషయాన్ని ఓడరేవులోని హార్బర్‌ మాస్టర్‌ కెప్టెన్‌ నిర్మల్‌ డిసెల్వ ధ్రువీకరించారు.

  • టీమ్​ఇండియాకు ఎదురుదెబ్బ, సుందర్​ స్థానంలో ఆడేది అతడే

ఇటీవలే గాయపడిన ఆల్​రౌండర్​ వాషింగ్టన్ సుందర్​ జింబాబ్వే పర్యటనకు దూరమయ్యాడు. అతడి స్థానంలో మరో ఆటగాడి పేరును ప్రకటించింది బీసీసీఐ. ఎవరంటే

  • నిర్మాతలు స్ట్రైక్​ చేయడం ఏంటో, ఓటీటీకన్నా అదే ప్రమాదకరం

టికెట్ ధరల తగ్గింపు, నిర్మాణ వ్యయాలు, ఓటీటీలో సినిమాల విడుదల.. ఇలా పలు సమస్యల కారణంగా కొద్ది రోజులుగా షూటింగ్స్ తాత్కాలికంగా నిలిచిపోయాయి. తాజాగా ఈ విషయమై నిర్మాత అశ్వినీ దత్​ స్పందించారు. ఈ సమస్యలపై తన అభిప్రాయాల్ని తెలిపారు. ఆయన ఏమన్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూసేయండి...

  • సామాన్యులకు షాక్, పాల ధరలు పెంపు

దేశవ్యాప్తంగా బుధవారం నుంచి పాల ధరలు పెంచుతున్నట్లు అమూల్​, మదర్​ డెయిరీ సంస్థలు ప్రకటించాయి. లీటరుపై 2 రూపాయలు అధికంగా వసూలు చేయనున్నట్లు తెలిపాయి.

  • ఉగ్రవాదుల కిరాతకం, మరో కశ్మీరీ పండిట్ దారుణ హత్య

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మరో కశ్మీరీ పండిట్​ను దారుణంగా కాల్చి చంపారు. ముష్కరుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు పోలీసులు.

  • నదిలో పడ్డ జవాన్ల వాహనం, ఆరుగురు మృతి

జమ్ముకశ్మీర్​లో భద్రతా బలగాల వాహనం నదిలో పడిపోగా ఆరుగురు జవాన్లు మృతి చెందారు. 30 మంది సైనికులు గాయాలపాలయ్యారు.

  • ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్లేందుకు పాదయాత్రన్న బండి సంజయ్

జనగామ జిల్లాలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగుతోంది. పాలకుర్తి మండలంలో 16 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు. నేటితో వెయ్యి కిలోమీటర్ల పూర్తవుతున్న సందర్భంలో బండి సంజయ్‌తో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి.

  • హైదరాబాద్‌ మెట్రోలో విద్యార్థుల జాయ్ రైడ్

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ.. విద్యార్థులతో జాయ్ రైడ్ నిర్వహించింది. అమీర్‌పేట్ నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ వరకు నిర్వహించిన ఈ జాయ్ రైడ్‌లో సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు మెట్రో అధికారులు కూడా పాల్గొన్నారు.

  • ఆ సమయానికి రెడ్‌ సిగ్నల్‌ పడి జనగణమన గీతం వచ్చేలా ప్రోగ్రామింగ్

స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. పదకొండున్నరకు ఎక్కడివారు అక్కడే నిల్చొని జాతీయగీతం ఆలపించారు. హైదరాబాద్​ పరిధిలో ఆన్‌లైన్‌లో అనుసంధానమైన కూడళ్ల వద్ద రెడ్‌ సిగ్నల్‌ పడి జాతీయ గీతం వచ్చేలా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ప్రోగ్రాం చేశారు.

  • తేళ్లతో దేవుడికి నైవేద్యం పెట్టే వింత ఆచారం, ఎక్కడో తెలుసా

ఎక్కడైనా దేవుడికి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకుంటారు. ఇంకా అయితే ప్రీతిపాత్రమైన ఫలహారాన్నివండి దేవుడికి నైవేద్యం పెడతారు. ఆ ప్రాంతంలో మాత్రం తేళ్లను పట్టుకుని నైవేద్యంగా సమర్పిస్తారు. పెద్దలే కాదు చిన్నపిల్లలు సైతం తేళ్లను భయంలేకుండా పట్టుకుంటారు.

  • భారత్​ అభ్యంతరాలు బేఖాతరు, శ్రీలంకకు చైనా నిఘా నౌక

భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా చైనా నిఘా నౌక యూవాన్​ వాంగ్​ శ్రీలంక చేరుకుంది. దక్షిణ ప్రాంతంలోని హంబన్‌టొట పోర్టులో నౌకను మోహరించారు. ఈ విషయాన్ని ఓడరేవులోని హార్బర్‌ మాస్టర్‌ కెప్టెన్‌ నిర్మల్‌ డిసెల్వ ధ్రువీకరించారు.

  • టీమ్​ఇండియాకు ఎదురుదెబ్బ, సుందర్​ స్థానంలో ఆడేది అతడే

ఇటీవలే గాయపడిన ఆల్​రౌండర్​ వాషింగ్టన్ సుందర్​ జింబాబ్వే పర్యటనకు దూరమయ్యాడు. అతడి స్థానంలో మరో ఆటగాడి పేరును ప్రకటించింది బీసీసీఐ. ఎవరంటే

  • నిర్మాతలు స్ట్రైక్​ చేయడం ఏంటో, ఓటీటీకన్నా అదే ప్రమాదకరం

టికెట్ ధరల తగ్గింపు, నిర్మాణ వ్యయాలు, ఓటీటీలో సినిమాల విడుదల.. ఇలా పలు సమస్యల కారణంగా కొద్ది రోజులుగా షూటింగ్స్ తాత్కాలికంగా నిలిచిపోయాయి. తాజాగా ఈ విషయమై నిర్మాత అశ్వినీ దత్​ స్పందించారు. ఈ సమస్యలపై తన అభిప్రాయాల్ని తెలిపారు. ఆయన ఏమన్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూసేయండి...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.