ETV Bharat / city

Telangana Top News: టాప్​న్యూస్ @ 3PM - టాప్​న్యూస్ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

3PM TOPNEWS
3PM TOPNEWS
author img

By

Published : Aug 6, 2022, 2:59 PM IST

  • 'కార్యకర్తలు కష్టపడి.. రేవంత్‌ను సీఎం చేయాలా..?'

కాంగ్రెస్‌ పార్టీలో తమకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు కష్టపడి.. రేవంత్‌ను సీఎం చేయాలా అని ఆయన ప్రశ్నించారు. పీసీసీ హోదాలో ఉన్న రేవంత్​రెడ్డి చండూరు సభలో తనపై చేసిన విమర్శలు బాధ కలిగించాయన్నారు. ఈ మేరకు ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడారు.

  • వైరల్​గా మారిన ఆర్జీయూకేటీ భోజనశాల సిబ్బంది నిర్వాకం..

బాసర ఆర్జీయూకేటీలోని ఓ భోజనశాలలో పనిచేసే సిబ్బందికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఇప్పుడిప్పుడే క్యాంపస్​లో సమస్యలు సద్దుమణుగుతున్నాయనుకుంటే.. సిబ్బంది నిర్వాకంతో మరోసారి హాట్​టాపిక్​గా మారింది. అసలు ఆ వీడియోలో ఏముందంటే..?

  • ఫ్రెండ్​షిప్ మ్యాజిక్..

బాధలో ఉన్న తమ స్నేహితుడి మోములో చిరునవ్వు చూడాలనుకున్నారు ఆ చిన్నారులు. అనుకున్నదే ఆలస్యం.. ఉపాధ్యాయుడితో తమ ఆలోచన పంచుకున్నారు. అంతా కలిసి అద్భుతం చేశారు. నీ కోసం మేమున్నామనే సందేశం పంపారు. ఇంతకీ వారేం చేశారు.. ఏం సందేశమిచ్చారో తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే.

  • ఒకే రోజు.. రెండు వేర్వేరు ప్రమాదాలు.. భార్యాభర్తలు మరణం

ఓ రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. రోడ్డు ప్రమాదంలో భర్త మరణించాడని తెలుసుకున్న ఓ భార్య అతడిని చూసేందుకు బయలుదేరింది. ఇంతలో వీరిని విధి చిన్న చూపు చూసింది. అక్కడికి వెళ్లే క్రమంలో బైక్​ అదుపుతప్పి మృతుడి భార్య కూడా కన్నుమూసింది.

  • సైకిల్​పై వెళ్తూ డ్రైనేజీలో పడ్డ బాలిక..

గుజరాత్ మెహ్సానా జిల్లాలో దారుణం జరిగింది. సైకిల్ మీద వెళ్తున్న ఏడేళ్ల బాలిక అదుపు తప్పి డ్రైనేజీలో పడిపోయింది. సమాచారం అందుకొని వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించిన మున్సిపల్ అధికారులు.. రెండు గంటల తర్వాత బాలిక ఆచూకీ కనుగొన్నారు.

  • మానసిక రోగుల ఆహారంలో ఎలుక..

మానసిక రోగులకు అందించిన ఆహారంలో చనిపోయిన ఎలుక బయటపడింది. ఈ ఘటన ఝార్ఖండ్​ రాంచీలోని రిన్​పస్​ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. దీనిపై రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

  • కడుపులో స్టీల్ గ్లాస్​.. గంటసేపు వైద్యుల సర్జరీ..

ఉత్తర్​ప్రదేశ్​లోని వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. సుమారు గంటపాటు శ్రమించి రోగి కడుపులో నుంచి స్టీల్​ గ్లాసును తొలగించారు.

  • తైవాన్ కీలక రక్షణ అధికారి మృతి...

తైవాన్‌, చైనా మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుతున్న వేళ.. తైవాన్‌ రక్షణ రంగానికి చెందిన ఓ కీలక అధికారి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మరోవైపు, తమ ప్రధాన భూభాగంపై దాడికి డ్రాగన్‌ సన్నాహాలు చేస్తోందని తైవాన్​ ఆరోపించింది.

  • దర్శకుడు శంకర్​, క్రికెటర్​ సురేశ్​రైనాకు గౌరవ డాక్టరేట్​

మాజీ క్రికెటర్ సురేశ్‌ రైనా, ప్రముఖ దర్శకుడు శంకర్‌ గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు. తమిళనాడు గవర్నర్‌ ఆర్​ఎన్​ రవి వీరిద్దరికీ గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేశారు.

  • టైమ్​పాస్ ముచ్చట్లే కాదు..

కాలం మారింది.. రచ్చబండలు ఆన్​లైన్​లోకి వచ్చేశాయ్.. సోషల్ ఆడియో యాప్స్ పేరుతో రచ్చ చేస్తున్నాయి. వీటి ద్వారా.. ముఖాలు చూసుకోకుండానే కబుర్లు చెప్పుకునే అవకాశం లభిస్తోంది. ప్రస్తుతం వీటికి డిమాండ్ పెరుగుతోంది. మరి ఇందులో పాపులర్ యాప్స్ గురించి వివరాలు మీకోసం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.