ETV Bharat / city

KTR Inaugurates LB Nagar Underpass : 'కేంద్రం నుంచి కిషన్‌రెడ్డి రూ.10వేల కోట్లు తీసుకురావాలి' - ఎల్బీ నగర్‌లో కేటీఆర్ పర్యటన

KTR Inaugurates LB Nagar Underpass: హైదరాబాద్‌లో వరద ముంపు సమస్య పరిష్కారానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 10 వేల కోట్ల నిధులు తీసుకురావాలని మంత్రి కేటీఆర్ సూచించారు. హైదరాబాద్‌ అభివృద్ధికి భాజపా నేతలు తమతో పాటు పోటీ పడాలని చురకలంటించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్‌.. 2,500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.

KTR Inaugurates LB Nagar Underpass
KTR Inaugurates LB Nagar Underpass
author img

By

Published : Mar 16, 2022, 11:55 AM IST

Updated : Mar 16, 2022, 2:05 PM IST

కేంద్రం నుంచి కిషన్‌రెడ్డి రూ.10వేల కోట్లు తీసుకురావాలి
KTR Inaugurates LB Nagar Underpass : హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ఎస్‌ఆర్‌డీపీ కింద ఎల్బీ నగర్‌లో రూ.672 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రూ.2500 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. కొత్తపేట గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కడుతున్నట్లు చెప్పారు. ఎల్బీ నగర్‌లో ఉన్న భూ రిజిస్ట్రేషన్ సమస్యలను త్వరలోనే పరిష్కరించి, కొత్త పింఛన్లను మూడు నెలల్లోగా ఇస్తామని వెల్లడించారు.

ఎల్బీనగర్ అండర్‌పాస్ ప్రారంభం..

KTR Demands Funds From Central : ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. ఎల్బీనగర్ కూడలిలో అండర్‌పాస్‌ను ప్రారంభించారు. రూ.9.28 కోట్లతో దీన్ని నిర్మించినట్లు తెలిపారు. అనంతరం నాగోల్, బండ్లగూడలో నాలాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వరద ముంపు నివారణకు రూ.103 కోట్లతో నాలాలు అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. తర్వాత బైరామల్‌గూడలో రూ.28.64 కోట్లతో జీహెచ్‌ఎంసీ నిర్మించిన పైవంతెన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్‌తో పాటు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు.

మాతో పోటీ పడాలి..

KTR About Hyderabad Development : భాజపా కార్పొరేటర్లు కూడా వారి వారి వార్డుల అభివృద్ధికి ముందడుగు వేయాలని కేటీఆర్ సూచించారు. పనులు చేసేందుకు ముందుకు రావాలని..స్థానిక ఎమ్మెల్యేతో సంప్రదింపులు జరపాలని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10వేల కోట్లు మంజూరయ్యేలా చూసి.. హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రగతిలో కాషాయ నేతలు గులాబీ నాయకులతో పోటీ పడాలని అన్నారు.

నిధులు తీసుకురండి..

KTR Visits LB Nagar : "హైదరాబాద్‌లో అతి ముఖ్యమైన సమస్య వరద ముప్పు. ఈ ఏడాది వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నాళాల పనులు వానాకాలంలోగా పూర్తి చేస్తాం. భాగ్యనగరంలో వరద ముంపు సమస్య పరిష్కారానికి కేంద్రం నుంచి భాజపా నిధులు తీసుకురావాలి."

- కేటీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి

Last Updated : Mar 16, 2022, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.