ETV Bharat / city

మోదీజీ... ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేదా ఎన్జీవోనా?: కేటీఆర్​

KTR Tweet: తెలంగాణలోని వంశపారంపర్య దుష్టపాలనకు ముగింపు పలకాలని ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌కు ఘాటుగా స్పందించారు కేటీఆర్​. హైదరాబాద్ గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పుకునే మీరు.. వరదలు వచ్చినప్పుడు నిధులు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు.

telangana-minster-ktr-counter-tweet-to-pm-pm-modi
ప్రధాని మోదీ ట్వీట్​కు కేటీఆర్ కౌంటర్​
author img

By

Published : Jun 8, 2022, 5:31 AM IST

Updated : Jun 8, 2022, 9:26 AM IST

KTR Counter to Modi: హైదరాబాద్‌కు మాటలు, నిధులు మాత్రం గుజరాత్‌కు అంటూ ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్​ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పుకునే ప్రధాని వరదలు వచ్చినప్పుడు నిధులు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. మూసీ నది ప్రక్షాళనకు, మెట్రో రైలు పొడిగింపునకు, రాష్ట్రానికి ఐటీఐఆర్​ ప్రాజెక్టు విషయాలపై పురోగతి ఏంటో చెప్పాలని ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రధాని చేసిన ట్వీట్‌కు ఈ మేరకు కేటీఆర్‌ బదులు ఇచ్చారు.

అంతకుముందు హైదరాబాద్‌ కార్పొరేటర్లతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. భేటి అనంతరం తెరాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ప్రధాని, తెలంగాణలోని వంశపారంపర్య దుష్టపాలనకు ముగింపు పలకాలని ట్వీట్‌ చేశారు. దీనిపై ఘాటుగా స్పందించిన కేటీఆర్‌ సమాజ సేవకు ప్రయత్నాలేమైనా ఉన్నాయా అంటూ ప్రధానిపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. మీరు నడుపుతుంది ప్రభుత్వాన్నా లేదా స్వచ్ఛంద సంస్థనా ప్రశ్నించారు.

  • Modi Ji, Community service endeavours?! Are you running a Govt or an NGO?

    Any update on Flood relief funds for Hyderabad? Any monetary support for Musi rejuvenation or Hyd Metro extension? Any update on ITIR?

    Mere lip service for Hyderabad/Telangana & funds only for Gujarat 👏 https://t.co/cntjvBGpx9

    — KTR (@KTRTRS) June 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: కష్టపడి పనిచేయండి.. భాజపా కార్పొరేటర్లకు మోదీ ఉద్బోధ

Last Updated : Jun 8, 2022, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.