Talasani Comments on Tamilisai : గవర్నర్ ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తమను ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలు ఎన్నుకున్నారని.. తాము నామినేటెడ్ వ్యక్తులం కాదని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రితో పనిచేయడం ఇష్టం లేదని చెప్పడం గవర్నర్ విజ్ఞతకే వదిలేస్తున్నామని వ్యాఖ్యానించారు. గవర్నర్‌గా వారి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని తలసాని పేర్కొన్నారు.
"గవర్నర్ పదవిలో ఉండి రాజకీయ నేతలా మాట్లాడం మంచిది కాదు. ఈ సీఎంతో పని చేయడం ఇష్టం లేదని చెప్పడం కూడా సరికాదు. తమిళిసై రాజకీయ పరమైన మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదు. ఉపరాష్ట్రపతి, గవర్నర్ అనే రోల్ చాలా తక్కువ. గవర్నర్‌గా మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. రాజ్యంగపరమైన అంశంలో కాంగ్రెస్ విధానమేంటి?"
- తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి