KTR Tweet to Central Minister : ‘‘వరంగల్ జిల్లాకు చెందిన 72 ఏళ్ల మాదాడి శ్రీమతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అమెరికా నార్త్ కరోలినాలో పనిచేస్తున్న ఆమె కుమారుడు వినయ్‌రెడ్డికి అత్యవసర వీసా మంజూరు చేయండి’’ అని మంత్రి కేటీఆర్ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ను గురువారం ట్విటర్‌లో కోరారు. అమెరికాలోని భారత రాయబార కార్యాలయ అధికారులతోనూ మాట్లాడారు.
-
Request Minister Sri @DrSJaishankar Ji to kindly direct @IndianEmbassyUS and @IndiaVisaDC to take this request as an exception and process
— KTR (@KTRTRS) January 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Vijay’s mother is critical and he needs to travel back to India https://t.co/lwV94UN3Lw
">Request Minister Sri @DrSJaishankar Ji to kindly direct @IndianEmbassyUS and @IndiaVisaDC to take this request as an exception and process
— KTR (@KTRTRS) January 27, 2022
Vijay’s mother is critical and he needs to travel back to India https://t.co/lwV94UN3LwRequest Minister Sri @DrSJaishankar Ji to kindly direct @IndianEmbassyUS and @IndiaVisaDC to take this request as an exception and process
— KTR (@KTRTRS) January 27, 2022
Vijay’s mother is critical and he needs to travel back to India https://t.co/lwV94UN3Lw
KTR Tweet to Central Minister JaiShankar : వినయ్‌రెడ్డి అంతకుముందు కేటీఆర్‌కు ట్విటర్ ద్వారా తన పరిస్థితి వివరించారు. ‘‘నాకు కెనడా పౌరసత్వం ఉన్నందున అమెరికా ప్రభుత్వం వీసాను సస్పెండ్ చేసింది. వరంగల్ వచ్చేందుకు సాయం చేయండి’’ అని ఆయన అభ్యర్థించగా కేటీఆర్ స్పందించారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న నల్గొండ జిల్లా నక్కలపెంట తండాకు చెందిన మూడేళ్ల బాలుడు హరిచంద్రకాంత్‌కు నిమ్స్‌లో చికిత్స చేయిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఒక నెటిజన్ బాలుడి కుటుంబ దీన స్థితిని మంత్రికి ట్విటర్ ద్వారా తెలిపారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!