ETV Bharat / city

కృష్ణా జలాల కోసం పూర్తిస్థాయిలో పోరాడతాం: కేటీఆర్​ - ASK KTR

ఏపీ సీఎం జగన్‌తో మాకు మంచి సంబంధాలున్నాయని కేటీఆర్​ తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కుల కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. రాజ్యాంగం ప్రకారం దేశంలోని అన్ని మతాలు, వర్గాలకు సమాన అవకాశాలు, గౌరవించే రామరాజ్యం రావాలన్నది తన కోరికని అందుకు ప్రార్థిద్దామని సూచించారు కేటీఆర్.

telangana minister KTR
telangana minister KTR
author img

By

Published : Aug 9, 2020, 3:13 PM IST

Updated : Aug 9, 2020, 3:31 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్​తో మంచి సంబంధాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్​ తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. జగన్ విషయంలో మెతగ్గా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.

ఆస్క్ కేటీఆర్..

ట్విట్టర్ వేదికగా ఆస్క్ కేటీఆర్ సెషన్​ నిర్వహించిన కేటీఆర్​... నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కుల కోసం పూర్తి స్థాయిలో పోరాడతామన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. కరోనా చికిత్సకు సంబంధించి ఇప్పటికే రెండు ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నామన్న మంత్రి... ఈ విషయంలో ప్రభుత్వం వెనుకంజ వేయబోదని స్పష్టం చేశారు.

రోజుకు 40 వేల కరోనా పరీక్షలు..!

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స కోసం అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని కేటీఆర్​ పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ దవాఖానాలకు వెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 23 వేల కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. త్వరలోనే ఈ సంఖ్యను 40 వేలకు పెంచుతామని చెప్పారు.

ఆరోగ్యశ్రీ మెరుగైన పథకం..

కొవిడ్​పై యుద్ధంలో ప్రజలంతా ప్రభుత్వంతో కలిసి రావాలని కోరారు. భయం, దుష్ప్రచారాలను విడనాడి రోగుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఇద్దరు వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం తనను కలచివేసిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది ఎంతో విలువైన సేవలు అందిస్తున్నారని కేటీఆర్​ ప్రశంసించారు. కేవలం నెగెటివ్ అంశాలపైనే దృష్టి సారించడం తగదని సూచించారు. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ మెరుగైన పథకమని మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు.

కొవిడ్​ వ్యాక్సిన్​ ఎప్పుడొస్తుందంటే..

వైద్యరంగంలో మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని... కరోనా మహమ్మారి ఆ అవసరాన్ని స్పష్టంగా గుర్తు చేసిందని తెలిపారు. కరోనాకు మొదటి వ్యాక్సిన్ తెలంగాణ నుంచే వస్తుందని ఆశిస్తున్నానన్న కేటీఆర్... ఇతర దేశాల నుంచి వచ్చినా సంతోషమేనని వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి 6 నుంచి 9 నెలల సమయం పడుతుందని తయారీదారులు చెప్పారన్నారు. కరోనా పరీక్షల విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిక లేదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐసీఎంఆర్​ మార్గదర్శకాల ప్రకారం మహమ్మారిపై పోరాడుతున్నామని వివరించారు.

రామరాజ్యం రావాలి..

ప్రజారవాణాను తిరిగి ప్రారంభించే విషయంలో కేంద్రం అనుమతి కోసం వేచి చూస్తున్నట్లు చెప్పారు. రాజ్యాంగం ప్రకారం దేశంలోని అన్ని మతాలు, వర్గాలకు సమాన అవకాశాలు, గౌరవించే రామరాజ్యం రావాలన్నది తన కోరికని అందుకు ప్రార్థిద్దామని కేటీఆర్ అన్నారు.

రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రానున్నాయని, ఇందుకు సంబంధించి త్వరలోనే ప్రకటనలు ఉంటాయన్నారు. స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న నిర్ణయం యువతకు ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుత ప్రపంచంలో స్కిల్, అప్ స్కిల్, రీస్కిల్ మంత్రమని... ఆధునిక సాంకేతికలపై దృష్టిసారించి ఎప్పటికప్పుడు కొత్తవి నేర్చుకోవాలని యువతకు సూచించారు.

దుర్గం చెరువు వంతెన ప్రారంభం..

ప్రపంచంలోనే ఎక్కువ సీసీటీవీ కెమెరాలు ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి కావడం గర్వకారణమన్నారు. నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం సీసీటీవీ కెమెరాల సంఖ్యను మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నెల మూడో వారంలో దుర్గం చెరువు తీగల వంతెన ప్రారంభిస్తామని, టీ ఫైబర్ పనులు ఏడాదిలో పూర్తవుతాయని ప్రకటించారు.

యువత రాజకీయాల్లోకి రావాలి..

టీఎస్ బీపాస్ గేమ్ చేంజర్ అవుతుందని, పట్టణ సంస్కరణల్లో బెంచ్ మార్క్​గా నిలుస్తుందని మంత్రి తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చే యువతకు కేసీఆర్ మార్గదర్శని, విద్యావంతులైన యువకులు రాజకీయాల్లోకి రావాలని కేటీఆర్ అన్నారు. చదువుకున్న యువత.. మౌనం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు.

ఇవీచూడండి: ఐదు రోజులుగా కృష్ణా నది మధ్యలో గొర్రెల మంద, కాపరి

Last Updated : Aug 9, 2020, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.