ETV Bharat / city

నాలాల ప్రక్షాళనకు కేటీఆర్ వ్యూహం.. ఆక్రమణదారులకు 'డబుల్' ఇళ్లు

author img

By

Published : Oct 7, 2021, 9:00 AM IST

చినుకు పడితే భాగ్యనగరం వణికిపోతోంది. కాసేపు కురిసే వానకే నగరంలోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇక ఏకధాటిగా వర్షం పడితే.. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కమంటూ బతకాల్సిందే. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి మంత్రి కేటీఆర్ నడుం బిగించారు. మూసీ పరివాహక ప్రాంతాలు, నాలాలకు ఆనుకొని నివసిస్తున్న ఆక్రమణదారుల్లో కదలిక తీసుకురావడానికి ఓ ప్లాన్ ఆలోచించారు.

నాలాల ప్రక్షాళనకు కేటీఆర్ వ్యూహం
నాలాల ప్రక్షాళనకు కేటీఆర్ వ్యూహం

అదిగో నాలాల ప్రక్షాళన.. ఇదిగో మూసీ నది సుందరీకరణ.. అంటూ రెండేళ్లగా అధికారులు నెలకోసారి ప్రకటనలతో ఊదరగొడుతున్నారు. ఇంతవరకు ఈ రెండింటిలో ఏ ఒక్కటీ ఇసుమంత కదల్లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భాగ్యనగరం మరోమారు వణికింది. భవిష్యత్తు ముప్పును ఎదుర్కోవాలంటే ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడం ఒక్కటే ప్రత్యామ్నాయం అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ గుర్తించారు. మూసీ పక్కన, నాలాలకు ఆనుకొని నివసిస్తున్న వారిలో అర్హులకు రెండు పడక గదుల ఇళ్లను కేటాయించడంతోపాటు అవసరమైనవారికి పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు సీఎంతో ఆమోదముద్ర వేయించుకుని కనీసం 25 వేల మందికి ఉచితంగా డబుల్‌ బెడ్రూం ఇళ్లను ఇవ్వాలని యోచిస్తున్నారు. ఇలా చేస్తే ఆక్రమణదారుల్లో కదలిక వస్తుందని మంత్రి భావిస్తున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో 185 చెరువుల పునరుద్ధరణకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలిచ్చింది. ఆక్రమణల తొలగింపు, సుందరీకరణ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిషనర్‌ను నియమించాలని నిర్ణయించింది. తొలి దశలో భాగంగా వచ్చే ఏడాదిలోగా రూ.150 కోట్ల వ్యయంతో పనులను ప్రారంభించాలని నిర్ణయించారు. ఇదే తరహాలో నాలాల ప్రక్షాళన విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే విస్తరణ ఎప్పటికీ పూర్తికాదని నిపుణులు ఇటీవల మంత్రి కేటీఆర్‌ దృష్టికి తెచ్చారు. నాలాల విస్తరణ విషయంలో కేటీఆర్‌కు ఇటీవల కొంతమంది నిపుణులతో ఆయన చర్చించారని అధికారులు చెబుతున్నారు.

విస్తరణ చేపట్టాలంటే ముందు వాటికి ఆనుకుని ఉన్న నిర్మాణాలను తొలగించాలన్న నిర్ణయానికి వచ్చారు. చాలామంది పక్కా ఇళ్లు నిర్మించుకొని ఉండడం వల్ల అక్కడి నుంచి బలవంతంగా పంపించడం సాధ్యం కాదు. అలా చేస్తే శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఏళ్లుగా నివసిస్తున్న వారిని గుర్తించి, ఉచితంగా రెండు పడక గదుల ఇళ్లను ఇస్తే తరలివెళతారన్న అంచనాకు వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో నిర్మిస్తున్న లక్ష డబుల్‌ బెడ్రూం ఇళ్లలో 25 వేల ఇళ్లను వీరికి కేటాయించే ఉద్దేశంలో మంత్రి కేటీఆర్‌ ఉన్నారు. ఈ విషయాన్ని రెండు రోజుల కిందట శాసనమండలిలోనూ ఆయన చెప్పారు. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆమోదిస్తే పది రోజుల్లోనే ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మూసీకి ఆనుకొని ఉన్న ఇళ్లనూ గుర్తించాలనుకుంటున్నారు.

త్వరలో గుర్తింపు ప్రక్రియ!

ప్రక్షాళనలో భాగంగా నాలాల పక్కన, మూసీని ఆనుకొని నివసిస్తున్న వారిని గుర్తించే పనిని అధికారులు త్వరలో మొదలుపెట్టబోతున్నారని సమాచారం. కొద్ది రోజుల్లో మంత్రి కేటీఆర్‌ ఉన్నతాధికారులతో చర్చిస్తారని, ఆ తరువాత క్షేత్రస్థాయిలో పనులు మొదలవుతాయని ఓ ఉన్నతాధికారి ‘ఈనాడు’కు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి కనీసం కొన్ని నాలాలను అయినా విస్తరించాలన్న పట్టుదలతో ఉన్నారని వివరించారు. ఇదే ఊపులో మూసీ ప్రక్షాళన చేపట్టాలనుకుంటున్నారు. వచ్చే బడ్జెట్‌లో నిధులను కేటాయించి బాపూఘాట్‌ నుంచి 3 కి.మీ. మేర సుందరీకరణ పనులను ప్రయోగాత్మకంగా చేపట్టాలని భావిస్తున్నారు.

నగరంలో నాలాల స్వరూపం

చిన్నా, పెద్ద నాలాల విస్తీర్ణం : 7500 కి.మీ.

విస్తరణకు అయ్యే కనీస వ్యయం : రూ.10వేల కోట్లు

వాటిపై ఉన్న నిర్మాణాలు: సుమారు 30 వేలు

అధికులు మూడేళ్ల నుంచి 20 ఏళ్లుగా నివసిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.