ప్ర: లోక్‌సభ స్పీకర్‌తో జరిగిన దృశ్యమాధ్యమ సమీక్షలో ఏం చర్చించారు?
జ: కొవిడ్-19 నివారణకు ఆయా రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధుల పాత్ర గురించి ముఖ్యంగా చర్చించాం. రాష్ట్రాలకు రావాల్సిన ఆర్థిక వనరులు కోతల్లేకుండా ఇవ్వాలని శాసనసభా స్పీకర్‌తో కలిసి ఓం బిర్లా దృష్టికి తీసుకెళ్లాం.
ప్ర: మీరు లేవనెత్తిన అంశాలకు లోక్‌సభ సభాపతి నుంచి ఎలాంటి స్పందన వచ్చింది?
జ: స్పీకర్‌కు ఉన్న పరిధి మేరకు నిధులు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలన్న విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు.
ప్ర: కరోనా నివారణకు చట్టసభల సభ్యులు, ప్రజాప్రతినిధులు ఎలాంటి పాత్ర పోషించాలని మీరంటారు?
జ: ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు వైరస్ వ్యాప్తి నివారణకు ప్రజల్లో చైతన్యం కల్పించాలి. వారి నియోజకవర్గాల్లో పేదలకు, వలస కార్మికులకు ప్రతి రోజూ నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు.
ప్ర: ఇటువంటి పరిస్థితిలో ప్రజలకు మీరిచ్చే సలహాలేంటి?
జ: ఇలాంటి పరిస్థితి మా జీవితకాలంలో చూడలేదు. ఉద్యమాలు వచ్చినప్పుడు ఒక రోజు, రెండు రోజులు కర్ఫ్యూలు చూసినం కానీ నెలల పాటు మాత్రం ఎప్పుడు లేదు. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు నివారణ చర్యలు తీసుకోవడం, వసతులు కల్పిస్తున్నాయి. పోలీసులు, వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది ప్రతి ఒక్కరూ సమష్ఠిగా కృషి చేస్తున్నారు. మన కోసం మన కుటుంబం కోసం స్వీయ నిర్బంధంలో ఉండి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా.
ఇదీ చదవండి: 'ఎవరూ ఈ విద్యా సంవత్సరం ఫీజులు పెంచొద్దు'