ETV Bharat / city

ప్రధాన వార్తలు@3PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

author img

By

Published : Dec 9, 2020, 2:58 PM IST

ప్రధాన వార్తలు@3PM
ప్రధాన వార్తలు@3PM

1. వరద బాధితులకు ఆర్థికసాయం

హైదరాబాద్ మహానగరంలో వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించే ప్రక్రియ కొనసాగుతోందని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించడంలో నిస్సహాయత వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని జీహెచ్‌ఎంసీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. విచారణ వాయిదా

ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పథకం-ఎల్‌ఆర్‌ఎస్​ అమలుపై విచారణను హైకోర్టు ఐదు వారాలకు వాయిదా వేసింది. ఎల్‌ఆర్‌ఎస్​ పిటిషన్లపై కౌంటరు దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరింది. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం రుసుములు నిర్ధరించి ప్రక్రియ ప్రారంభించగా కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. భారత్‌ బయోటెక్‌ సందర్శన

హైదరాబాద్‌లో 64 దేశాల రాయబారులు, హైకమిషనర్లు పర్యటిస్తున్నారు. భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్-ఇ సంస్థను ఈ బృందం సందర్శించింది. కరోనా టీకాల తయారీపై అధ్యయనానికి విదేశీ ప్రతినిధులు హైదరాబాద్‌ వచ్చారు. దేశంలో కరోనా టీకాల పురోగతిని ఈ విదేశీ ప్రతినిధుల బృందం తెలుసుకుంటుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 74వ జన్మదిన వేడుకలను హైదరాబాద్ గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా వేడుకలే కాకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. ఘోర రోడ్డుప్రమాదం

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి రాయచూర్ వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. మూడు సార్లు గృహ నిర్భంధం

తనను అక్రమంగా గృహనిర్బంధం చేశారని మరోమారు ఆరోపించారు జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ. పక్షం రోజుల్లోనే మూడోసారి తనని నిర్బంధించారని ట్విట్టర్​ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. యూజర్ల డేటా లీక్​

దేశంలోని 70లక్షల మంది డెబిట్​, క్రెడిట్​ కార్డుదారుల వివరాలు ఇంటర్నెట్​లో లీక్​ అయ్యాయి. ఈ విషయాన్ని అంతర్జాల భద్రతా పరిశోధకుడు రాజశేఖర్​ వెల్లడించారు. ఇందులో వినియోగదారుల వ్యక్తిగత, ఆర్థిక వివరాలు ఉన్నాయన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. రైతు సంఘాలకు కేంద్రం లేఖ

సాగు చట్టాల్లో పలు సవరణలకు అంగీకరించిన కేంద్రం.. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను రైతులకు పంపించింది. కేంద్రం చేసిన ప్రతిపాదనలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు రైతు సంఘాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. కోహ్లీ లేకపోయినా..

సవాళ్లను స్వీకరించి ఎదుర్కొనేందుకు టీమ్​ఇండియా సిద్ధంగా ఉండాలని దిగ్గజ క్రికెటర్​ సచిన్​ చెప్పాడు​. ఆసీస్​తో టెస్టు సిరీస్​లో సారథి కోహ్లీ, ఇషాంత్​ శర్మ దూరమైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. సందడే సందడి

కొణిదెల నిహారిక-చైతన్య జొన్నలగడ్డ వివాహం.. బుధవారం రాత్రి జరగనుంది. ఈ సందర్భంగా పెళ్లి విశేషాలతో పాటు ఇతర ఆసక్తికర అంశాలు మీకోసం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.