రాష్ట్రంలో కొత్తగా 682 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 2,74,540కి పెరిగింది. మహమ్మారితో మరో ముగ్గురు కన్నుమూయగా, ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 1,477కు చేరుకుంది. తాజాగా 761 మంది కోలుకోగా.. మొత్తం 2,65,367 మంది ఆరోగ్యవంతులుగా ఇంటికెళ్లారు.
ప్రస్తుతం 7,696 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 5,634 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 102 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి.
ఇదీ చదవండి : బంద్‌కు ఆర్టీసీ మద్దతు... కదలని బస్సులు