ETV Bharat / city

TS Top News: టాప్​న్యూస్​@ 7AM - today latest news

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

TELANGANA LATEST NEWS
TELANGANA LATEST NEWS
author img

By

Published : Mar 17, 2022, 6:59 AM IST

  • భానుడి ఉగ్రరూపం

Heavy Temperatures: రాష్ట్రవ్యాప్తంగా భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. 40 నుంచి 42 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సెగలుకక్కుతున్న సూర్యుడి ప్రతాపానికి బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. భానుడి భగభగలకు జీవజాతులు అల్లాడిపోతున్నాయి. వారం రోజుల తరవాత ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ అధికారులు వడగాల్పుల తీవ్రత ఉంటుందని చెబుతున్నారు.

  • రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా వికాస్‌రాజ్

CEO Vikas Raj: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి వికాస్‌రాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

  • ముందే సాధారణ బదిలీలు

TS Transfers: రాష్ట్రంలో కొత్తగా 80,039 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇతర నియామక సంస్థలు నోటిఫికేషన్లకు సిద్ధమవుతున్నాయి. ఆ ప్రక్రియ పూర్తయ్యేలోపే నియామకాలు జరిగే శాఖల్లో ఉద్యోగులకు సాధారణ బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. త్వరలో భర్తీ చేయనున్న ఉపాధ్యాయ పోస్టుల్లో తొలుత ఉన్నతస్థాయి పోస్టుల ఫలితాలు వెల్లడైన తరువాతే, కిందిస్థాయి పోస్టుల ఫలితాలు ప్రకటించాలని గురుకుల, విద్యాశాఖలు భావిస్తున్నాయి.

  • 'మూడు రోజుల్లోనే వివేకాను హత్య చేయాలన్నారు'

Viveka Murder Case: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు దస్తగిరి... పులివెందుల మెజిస్ట్రేట్ ఎదుట అప్రూవర్‌గా మారిన తర్వాత ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2019 మార్చి 13, 14, 15... 3 రోజుల్లోనే వివేకాను హత్య చేయాలని.. ఎర్రగంగిరెడ్డి పథకం రచించినట్లు దస్తగిరి తెలిపాడు. ఈ తేదీల్లో నైట్‌ వాచ్‌మన్‌ ఉండడని తెలుసుకుని.. హత్య చేశామని వివరించాడు. వివేకాను హత్య చేస్తే.. భారీ మొత్తంలో డబ్బు ముట్టజెప్తామని.. అంతా తాము చూసుకుంటామని భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి భరోసా ఇచ్చారని తెలిపాడు.

  • థియేటర్‌పై బాంబుల వర్షం

Russia Ukraine War: ఉక్రెయిన్​పై రష్యన్ సేనలు విరుచుకుపడుతున్నాయి. నివాస ప్రాంతాలని కూడా లెక్కచేయకుండా దాడులు కొనసాగిస్తున్న రష్యన్​ సేనలకు భయపడి వివిధ ప్రాంతాల్లో తలదాచుకుంటున్నా.. ప్రాణాలు దక్కటం లేదు. మేరియుపొల్​ నగరంలో ఇదే పరిస్థితి నెలకొంది. వెయ్యి మందికిపైగా తలదాచుకుంటున్న ఓ థియేటర్​పై రష్యా దాడి చేసింది. ఈ ఘటనలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

  • ఉక్రెయిన్​పై​ ఆగని దాడులు..

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌సహా ఇతర ప్రధాన నగరాల్లో రష్యా సేనలు పెద్దఎత్తున దాడులు చేస్తున్నాయి. ఫిరంగి దాడిలో సెంట్రల్‌ కీవ్‌లోని ఓ భవంతి 12వ అంతస్థులో మంటలు చెలరేగాయి. శాంతిచర్చల తీరుపై ఇరు దేశాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. మరోవైపు.. ఉక్రెయిన్​పై దాడులను వెంటనే ఆపాలని రష్యాను ఆదేశించింది అంతర్జాతీయ న్యాయస్థానం. దీనిని తమ విజయంగా పేర్కొన్నారు జెలెన్​స్కీ.

  • భారత్​పై పాక్​ క్షిపణిని ప్రయోగించాలనుకుందా?

Pakistan Missile Retaliation: తన భూభాగంలో మిసైల్​ పడిన ఘటనపై పాకిస్థాన్​ భారత్​పై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అయితే ఈ ఘటనపై ప్రతిచర్యగా క్షిపణిని ప్రయోగించాలని పాక్​ భావించినట్టు సమాచారం. అయితే ఈ వార్తలపై అటు భారత రక్షణశాఖ నుంచి గానీ, పాక్‌ నుంచి గానీ ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు.

  • బాలికపై స్కూల్​ యజమాని అత్యాచారం

Minor raped: రాజస్థాన్​లోని జైపుర్​లో మైనర్​పై అత్యాచారం చేశాడు ఓ వ్యక్తి. ప్రస్తుతం ఆ బాలిక రెండు నెలల గర్భవతి అని పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

  • ఐపీఎల్​ బయోబబుల్​ కొత్త నిబంధనలు ఇవే!

IPL 2022 Bio Bubble Rules: ఈ నెల 26న ఐపీఎల్ 15వ సీజన్​​ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కఠినమైన బయోబబుల్​ నిబంధనలను ప్రకటించింది. ఆటగాళ్లతో పాటు కుటుంబసభ్యులకు కూడా నిబంధనలు అమలులో ఉంటాయని బోర్డు పేర్కొంది. వాటిని ఉల్లంఘిస్తే భారీ మూల్యం తప్పదని హెచ్చరించింది.

  • మళ్లీ అగ్రస్థానం అంబానీకే

Adani and Ambani net worth: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీ సంపద గతేడాది దాదాపు రూ.3.67 లక్షలు పెరిగింది. సగటున రోజుకు ఆయన ఆదాయం రూ.1,000 కోట్లు. మరోవైపు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ 103 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.7.72 లక్షల కోట్ల) సంపదతో భారత్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.