ETV Bharat / city

TS Top News: టాప్​న్యూస్​@7 AM - telugu news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana latest top news
telangana latest top news
author img

By

Published : Mar 13, 2022, 6:59 AM IST

  • ఈ వారం రాశిఫలం

ఈ వారం (మార్చి 13- మార్చి19) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

  • 'మున్సిపాలిటీలకు మాస్టర్ ప్లాన్'

KTR in Assembly: హైదరాబాద్‌లో ఎలివేటెడ్‌ బీఆర్​టీఎస్​ వ్యవస్థ తీసుకువస్తున్నామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. సుమారు 2 వేల 500 కోట్ల వ్యయంతో విధివిధానాలు రూపకల్పన చేశామని పేర్కొన్నారు. బడ్జెట్‌ పద్దులపై చర్చలో భాగంగా మూడోరోజు వాడీవేడీ చర్చ జరగ్గా.. అన్ని మున్సిపాలిటీలకు ఈ ఏడాది మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని కేటీఆర్​ వెల్లడించారు. పోడు భూముల సమస్యపైనా చర్చించిన నేతలు.. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి హామీ ఇచ్చారు.

  • టెట్​ గట్టెక్కేదెట్లా?..

TET Exam: బీఈడీ పూర్తిచేసిన బయాలజీ, భాషాపండిత అభ్యర్థులు టెట్‌ను తలచుకొని ఆందోళన చెందుతున్నారు. వారు ఇంటర్‌, డిగ్రీలో చదివింది జీవశాస్త్రం. మరికొందరు తెలుగు సబ్జెక్టును పూర్తిచేశారు. వారందరికీ ఇపుడు గుండె దడ మొదలైంది. తాము ఏమాత్రం చదవని.. ఒకవేళ ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చినా బోధించని సబ్జెక్టులపై ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)లో ఎక్కువ మార్కులకు ప్రశ్నలు ఇస్తోండటంతో ఆందోళన చెందుతున్నారు.

  • ఎందుకు ఓడుతున్నాం..!

CWC Meet Today: వరుస ఎన్నికల వైఫల్యాలపై కాంగ్రెస్‌ సంఘర్షణ పడుతోంది. నేడు (ఆదివారం) వాడీ…వేడిగా సీడబ్ల్యూసీ భేటీ జరగనుంది. నాయకత్వ, సంస్థాగత మార్పుపైనా చర్చించనున్నారు. సోనియా, రాహుల్‌, ప్రియాంక రాజీనామా చేయనున్నారంటూ వస్తున్న ఊహాగానాలను కాంగ్రెస్‌ ఖండించింది.

  • విద్యార్థిపై ఉపాధ్యాయుడి క్రూరత్వం..

student beaten up by teacher: ఐదో తరగతి చదివే విద్యార్థిని ఓ ఉపాధ్యాయుడు చర్మం కమిలేలా కొట్టాడు. నిలదీసేందుకు వచ్చిన తల్లిదండ్రులపైనా ఉపాధ్యాయుడు ఘర్షణకు దిగాడు. ఈ ఘటన బిహార్​లోని బేతియా జిల్లాలో జరిగింది.

  • ప్రపంచం అతని కోసం ప్రార్థిస్తోంది!

zelensky: 'ఓ బఫూన్‌ ప్రెసిడెంట్‌గా పోటీచేస్తున్నాడు!' - అన్నారు తలపండిన రాజకీయనాయకులు హేళనగా. 'శత్రుదేశం దురాక్రమణ చేస్తుంటే ఈ పిరికివాడు శాంతిమంత్రం పఠిస్తున్నాడు!' - అన్నారు విదేశీనేతలు ఈసడింపుగా. 'మాకు కావాల్సింది ఆయుధాలు.. నేను పారిపోయేందుకు వాహనాలు కాదు. నా దేశాన్ని విడిచి నేనెక్కడికీ పోను..!' - అని నొక్కి చెప్పి ఒకప్పుడు తూలనాడినవాళ్లనే కాదు.. ప్రపంచ ప్రజలందర్నీ అభిమానులుగా మార్చుకున్నాడు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలెదిమిర్‌ జెలెన్‌స్కీ. పోరాటపటిమకి కొత్త చిహ్నంగా మారిన అతని ప్రస్థానమిది..

  • ఘోర రైలు ప్రమాదం..

Congo Train Accident: ఘోర రైలు ప్రమాదంలో 60 మందికి పైగా ప్రయాణికులు మరణించారు. కాంగోలో రైలు పట్టాలు తప్పిన కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

  • టాలీవుడ్​లో మాస్ జాతర..

Tollywood Mass movies of 2022: "క్యారెక్టర్‌ కొత్తగా ఉందని ట్రై చేశా... లోపల ఒరిజినల్‌ అలానే ఉంద'ని ఓ డైలాగ్‌ చెబుతారు 'బృందావనం' సినిమాలో ఎన్టీఆర్‌. మన కథానాయకుల బాట ఇంచుమించు అలాగే ఉంటుంది. ఎన్ని కొత్త కథలు చేసినా.. మధ్యలో అప్పుడప్పుడు తమలోని మాస్‌ కోణాన్ని బయటికి తీస్తూ తెరపై రచ్చ చేస్తుంటారు. ఇప్పుడు మన హీరోల ప్రయాణం అదే దారిలో సాగుతోంది. ఆ సంగతులేంటో చూద్దాం..

  • ఒలింపిక్​ ఛాంపియన్​కు షాక్​..

German Open: జర్మన్​ ఓపెన్​ సూపర్ 300 బ్యాడ్మింటన్​ టోర్నమెంట్​ ఫైనల్స్​లో అడుగుపెట్టాడు భారత యువకెరటం లక్ష్యసేన్. ఉత్కంఠగా జరిగిన సెమీస్​లో ఒలింపిక్స్​ గోల్డ్​ విన్నర్​ అక్సల్సెన్​పై విజయం సాధించాడు.

  • డబ్ల్యూటీటీలో భారత్​ జోడీకీ స్వర్ణం

FIH women pro league: ఎఫ్‌ఐహెచ్‌ మహిళల ప్రొ లీగ్‌ హాకీ టోర్నమెంట్లో జర్మనీతో పోరులో భారత్‌కు ఓటమి ఎదురైంది. కాగా, డబ్ల్యూటీటీ యూత్‌ స్టార్‌ కంటెండర్‌ టోర్నమెంట్లో భారత జంట సుహాన సైని-యశస్విని గోర్పాడే స్వర్ణం గెలిచింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.