ETV Bharat / city

TopNews: టాప్​న్యూస్​ @3 PM - telangana news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana top news
telangana top news
author img

By

Published : Mar 9, 2022, 2:59 PM IST

  • నేడే నోటిఫికేషన్‌

తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. నిరుద్యోగులకు సీఎం కేసీఆర్‌ తీపికబురు అందించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో 80,039 ఉద్యోగాలకు నేడే నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిన 11,103 ఒప్పంద ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తున్నట్లు చెప్పారు.

  • సర్వత్రా హర్షాతిరేకాలు..

TRS celebrations: నిరుద్యోగులకు సీఎం కేసీఆర్​ తీపికబురు వినిపించటంతో.. రాష్ట్రంలో సంబురాలు మిన్నంటుతున్నాయి. తెరాస శ్రేణులు, యువత, అభిమానులు.. హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ.. టపాసులు పేల్చుతూ.. తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  • పిట్టల్లా రాలుతున్న రష్యా విమానాలు..

Russia Ukraine war: రష్యా దాడిని సమర్థంగా ప్రతిఘటిస్తున్నాయి ఉక్రెయిన్​ సేనలు. యుద్ధానికి తెలివిగా సిద్ధమైన ఉక్రెయిన్ జవాన్లు.. రష్యా విమానాలను పిట్టల్లా కూల్చేస్తున్నారు. తక్కువ ఎత్తులో వచ్చే విమానాలపై భుజాలపై నుంచి ప్రయోగించే క్షిపణులతో సరిగ్గా గురి చూసి.. దాడి చేస్తున్నారు. మరోవైపు రష్యా దళాల కదలికలను అమెరికా, జర్మనీ నిఘా వర్గాలు గుర్తించి శాటిలైట్‌ చిత్రాలు, ఎలక్ట్రానిక్‌ సమాచారం విశ్లేషించి గంట నుంచి రెండు గంటల్లోపే ఉక్రెయిన్‌కు అందిస్తున్నాయి. వీటి ఆధారంగా ఉక్రెయిన్‌ దళాలు వ్యూహరచన చేసుకొంటున్నాయి.

  • చైనా కలల ప్రాజెక్ట్​కు ఉక్రెయిన్​ యుద్ధపోటు!

Ukraine war impact on China: చైనా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌పై(బీఆర్‌ఐ) ఉక్రెయిన్​ సంక్షోభం తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. భూతల, జల మార్గాల ద్వారా ఆఫ్రికా, ఐరోపాలతో ఆసియాను అనుసంధానించి అంతర్జాతీయంగా తిరుగులేని శక్తిగా అవతరించాలన్న ధ్యేయంతో బీఆర్‌ఐను డ్రాగన్‌ తలపెట్టింది. అయితే ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో చైనా వ్యవహరిస్తున్న తీరు ఐరోపా దేశాలకు అసంతృప్తి కలిగిస్తోంది.

  • 'ఆవు పేడ' సూట్​కేస్​లో బడ్జెట్ పత్రాలు​

Chhattisgarh CM Bhupesh Baghel: ఛత్తీస్​గఢ్​ అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాల ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్..​ ఆవుపేడతో చేసిన సూట్​కేస్​తో అసెంబ్లీకి వచ్చారు.

  • లవ్​ స్టోరీలో ట్విస్టులే ట్విస్టులు!

Man Marries Identical Triplets: ఓ వ్యక్తి ఒకే రోజు ముగ్గురు కవలలను(ట్రిప్లెట్స్​) పెళ్లిచేసుకొని ఇటీవల వార్తల్లోకెక్కాడు. జీవితంలో అన్నీ సమానంగా పంచుకునే కాంగోలోని ఆ ట్రిప్లెట్స్​.. భర్తగా ఒకే వ్యక్తిని ఎంచుకున్నారు. ఒకరినే ప్రేమించి పెళ్లిపీటలెక్కారు. అయితే.. ఈ కథలో ఎన్నో ట్విస్టులున్నాయి. ఆ వ్యక్తి ప్రేమించింది ఒక్కరినే అయినా.. ముగ్గురిని చేసుకోవాల్సి వచ్చింది. ఎలాగంటే?

  • ఆ రోజే రామ్​చరణ్​-శంకర్​ సినిమా టైటిల్​!

రామ్​చరణ్-శంకర్​ కాంబోలో తెరకెక్కుతున్న 'ఆర్​సీ 15' టైటిల్​ను చరణ్​ పుట్టినరోజున ప్రకటిస్తారని ప్రచారం సాగుతోంది. కాగా, బాలీవుడ్​ నటి విద్యాబాలన్​ నటించిన కొత్త సినిమా 'జల్సా' ట్రైలర్​ విడుదలై ఆకట్టుకుంటోంది.

  • టెస్ట్​ ర్యాంకింగ్స్​లో అతడే నెం. 1

Test Rankings 2022: ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్​ను విడుదల చేసింది. భారత క్రికెట్​ జట్టు ఆల్​ రౌండర్​ రవీంద్ర జడేజా ఐసీసీ టెస్టు ఆల్​ రౌండర్ల జాబితాలో అగ్ర స్థానానికి చేరుకున్నాడు.

  • సీఎస్కే ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్

IPL 2022 Deepak chahar: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్​ ప్రారంభం కానున్న నేపథ్యంలో చెన్నై సూపర్​కింగ్స్ అభిమానులకు గుడ్​ న్యూస్. గాయం కారణంగా సీఎస్కే జట్టుకు దూరమైన బౌలర్​ దీపక్​ చాహర్​ తిరిగి టీమ్​లోకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

  • ఎల్‌ఐసీ ఐపీఓకు సెబీ ఆమోదం

LIC IPO SEBI Approval: మదపర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎల్​ఐసీ ఐపీఓకు సెబీ ఆమోదం తెలిపినట్లు సమాచారం. దరఖాస్తు చేసుకున్న 22 రోజుల్లోనే అనుమతి లభించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. అయితే ఐపీఓకి ఎప్పుడొస్తుందన్నది ఇంకా తెలియరాలేదు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.