ETV Bharat / city

Top News: టాప్​న్యూస్​ @7 PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..

TELANGANA LATEST TOP NEWS
TELANGANA LATEST TOP NEWS
author img

By

Published : Feb 19, 2022, 6:58 PM IST

  • తెలంగాణలో కొత్త పార్టీ పెడతా..

Jaggareddy on Resign : తనపై కోవర్టును అనే ముద్ర వేశారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనపై బురద చల్లుతున్నందునే పార్టీని వీడాలని భావించానని చెప్పారు. తాను కాంగ్రెస్‌లో ఉంటే కొందరు ఇబ్బందిగా భావిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ బాగుండాలనే పార్టీని వీడేందుకు సిద్ధమయ్యా అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నుంచి బయటకెళ్లినా... వేరే పార్టీలో చేరనని పేర్కొన్నారు.

  • ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా క్లీన్‌స్వీప్‌..

ప్రజలు భాజపా నేతలపై ఎందుకు దాడి చేస్తారు ఎంపీ అర్వింద్‌ ప్రశ్నించారు. రైతులు, నిరుద్యోగుల ముసుగులో తెరాస నేతలు దాడిచేస్తున్నారని ఆరోపించారు. భాజపా కార్యకర్తలు ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాలను తెరాస నేతలు ఆవిష్కరించడంపై మండిపడ్డారు.

  • పంజాబ్​ ఎన్నికలకు సర్వం సిద్ధం..

Punjab polls 2022: 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ప్రక్రియలో.. మరో కీలక పర్వానికి సర్వం సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్‌లో మూడో విడత, పంజాబ్‌లో మొత్తం 117 స్థానాలకు ఆదివారం పోలింగ్‌ జరగనుంది. యూపీలో 59 స్థానాల్లో 627 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, పంజాబ్‌లో 1,304 మంది అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

  • అఫ్గాన్​ సిక్కు- హిందూ ప్రతినిధులతో మోదీ భేటీ..

PM Modi: అఫ్గానిస్థాన్​కు చెందిన సిక్కు- హిందూ సమాజ ప్రతినిధులతో తన నివాసంలో భేటీ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అఫ్గాన్​ నుంచి సిక్కులు, హిందువులను సురక్షితంగా భారత్​కు తీసుకురావటంపై ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు సిక్కు ప్రముఖులు. ఓ జ్ఞాపికను అందజేశారు.

  • దేశంలో ఉగ్రదాడికి భారీ కుట్ర..

NIA Raids Today: ఉగ్రదాడుల కుట్రకు సంబంధించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) జోరు పెంచింది. జమ్ముకశ్మీర్‌, రాజస్థాన్‌లోని ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. సోపోర్‌, కుప్వారా, షోపియాన్‌, రాజౌరీ, బుద్గాం, గందర్‌బల్‌, రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో పలు కీలక విషయాలను వెల్లడించింది.

  • ముగ్గురు పోలింగ్​ సిబ్బంది దుర్మరణం..

Odisha Bus Accident: బస్సు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు పోలింగ్​ సిబ్బంది దుర్మరణం చెందారు. మరో 25 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఘటన ఒడిశాలో జరిగింది.

  • భర్త జననాంగాలు కోసి దారుణ హత్య..

Woman kills husband: భర్త జననాంగాన్ని కోసి దారుణంగా హతమార్చింది ఓ మహిళ. ఈ ఘటన ఉత్తరాఖండ్​లోని పిథౌరాగఢ్​లో జరిగింది.

  • హోమ్​లోన్‌ ఈఎంఐ సరిగా కడుతున్నారా?

Home loan EMI payment problems: కొందరు అప్పులు చేసి సొంతింటి కలను సాకారం చేసుకుంటున్నారు. అయితే తేలిగ్గా గృహ రుణం తీసుకున్నా.. నిర్లక్ష్యం వల్లో.. ఆర్థిక ఇబ్బందుల కారణంగానో సక్రమంగా ఈఎంఐలు చెల్లించలేకపోతున్నారు. అటువంటివారిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలంటే..?

  • టీమ్​ఇండియా టెస్టు కెప్టెన్​గా రోహిత్..

వన్డే, టీ20లకు టీమ్​ఇండియా కెప్టెన్​గా అదరగొడుతున్న రోహిత్​ శర్మ.. ఇకపై టెస్టులకు పూర్తిస్థాయిలో సారథిగా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఇటీవల టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకొన్న నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీలంకతో త్వరలో ప్రారంభమయ్యే సిరీస్​తో రోహిత్ టెస్టు బాధ్యతలు అందుకోనున్నాడు.

  • క్షమాపణలు చెప్పిన హీరో విజయ్..

Tamil hero Vijay movies: తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ ఓటు వేశారు. ఆ సమయంలో తన ఫ్యాన్స్ ఎక్కువగా రావడం వల్ల ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. ఈ క్రమంలో వారందరికీ విజయ్ క్షమాపణలు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.