దేశ 'సర్వోన్నత' పీఠంపై తెలుగుతేజం
భారత దేశ 48వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎన్.వి. రమణది కృష్టా జిల్లా పొన్నవరం గ్రామం. సామాన్య రైతు కుటుంబం నుంచి సీజేఐగా ఎదిగారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో ప్రజల సమస్యల పరిష్కరణకు కృషి చేశారు ఆయన. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మంజీరా నదిలోకి కాళేశ్వర గంగ
మండుటెండల్లో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. కాళేశ్వర ప్రాజెక్టు ప్రస్థానంలో మరో అపూర్వ ఘట్టానికి గజ్వేల్ నియోజకవర్గం వేదికైంది. నిండు వేసవిలో గోదావరి జలాలు మంజీరా నదిలోకి పరుగులు పెట్టాయి. అవుసులోనిపల్లి వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిని విడుదల చేయగా.. హల్దీవాగులోకి కాళేశ్వర గంగ గలగలా పారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కరోనా ఆంక్షలేవి?
రెండో దశ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ మద్యం దుకాణాలు, బార్లు, పబ్‌లు, జిమ్‌లు, థియేటర్లపై ఆంక్షలు ఎందుకు విధించడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు చాలా తక్కువగా చేస్తున్నారని ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మంటల్లో లంచం
నాగర్‌కర్నూల్‌లో మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు లంచం డబ్బు తగలబెట్టారు. రూ.5 లక్షలను మంటల్లో వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఏపీలో పరిషత్ ఎన్నికలకు బ్రేక్
ఏపీలో పరిషత్ ఎన్నికలు నిలిపివేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిలిపివేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోడ్ విధించలేదని ఆక్షేపించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'మేం పోలీసులకు వ్యతిరేకం కాదు'
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ ఎన్కౌంటర్ ఘటనపై లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. తమపై 2వేల మంది పోలీసులు దాడి చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. పోలీసులు తమకు శత్రువులు కాదని ఆ లేఖలో వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'45 ఏళ్లు నిండిన ఉద్యోగులకు టీకా తప్పనిసరి'
కొవిడ్ టీకా విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం కీలక సూచనలు చేసింది. 45 ఏళ్లు నిండిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా టీకా వేసుకోవాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4 రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్
బంగాల్‌లో మూడోదశ ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తతల నడుమ జరిగింది. 31 నియోజవర్గాల్లో పోలింగ్ జరగ్గా.. సాయంత్రం 5 గంటల వరకు 77.68 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. పుదుచ్చేరిలో 78.13 శాతం, కేరళలో 73.58 శాతం పోలింగ్ నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ధోనీ పాఠాలతో ఆయనపైనే పోరు!
ఈ సీజన్ ఐపీఎల్ తొలి మ్యాచ్ చైన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరనుంది. తొలిసారి సారథిగా బాధ్యతలు చేపట్టనున్న రిషభ్ పంత్(దిల్లీ క్యాపిటల్స్).. ఈ మ్యాచ్‌లో తన మార్గనిర్దేశకుడైన ధోనీ నుంచి నేర్చుకున్న పాఠాలను అతడిపైనే ప్రయోగిస్తానని అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అనిల్ రావిపూడితో అల్లు అర్జున్ ?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ చిత్రం చేయనున్నారని సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.