- ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు..
రానున్న ఆరు నెలల్లో రాష్ట్రంలోని ప్రతి పురపాలికలో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో తెలిపారు. మున్సిపాలిటీలకు ప్రతి నెలా రూ.148 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. పట్టణాల్లో మొక్కల పెంపకం కోసం గ్రీన్ బడ్జెట్ ఉంటుందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'అందుకే గ్యాలరీ కూలింది!'
సూర్యాపేటలో జాతీయ కబడ్డీ క్రీడల్లో గ్యాలరీ కూలిన ఘటనలో గుత్తేదారు నిర్లక్ష్యం కనిపిస్తోంది. 5 వేల మంది కూర్చునే లక్ష్యంతో తాత్కాలికంగా నిర్మించిన గ్యాలరీ పటుత్వం కోసం సెంట్రింగ్ కర్రలను వాడటం విమర్శలకు దారితీస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కోచ్ ఫ్యాక్టరీ సాధించే వరకు..
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ డివిజన్ సాధింపు కోసం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ డివిజన్ పోరాట సమితి నిరసన దీక్ష చేపట్టింది. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ సాధించే వరకు పోరాడతామని నాయకులు ముక్తకంఠంతో నినదించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'కాంగ్రెస్ వస్తే చొరబాట్లు, అవినీతి'
అసోంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చొరబాట్లు, అవినీతి పెరుగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ఓటర్లను హెచ్చరించారు. అసోం ప్రత్యేకతను నాశనం చేయాలనే లక్ష్యంతో ఉన్న ఏఐయూడీఎఫ్‌తో కాంగ్రెస్ చేతులు కలిపిందని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఐఎన్ఎక్స్ మీడియా కేసులో..
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, ఆయన తనయుడు కార్తీ చిదంబరానికి దిల్లీ న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 7న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కాలువలో ఇరుక్కుపోయిన నౌక
ఈజిప్టులోని సూయిజ్ కాలువలో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఓ నౌక ఇరుక్కుపోయింది. దాంతో ఆ కాలువలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాలువలో ఉత్తరం వైపు మళ్లేందుకు ప్రయత్నించగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బీఎండబ్లూ 220ఐ రిలీజ్..
లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మేడ్ ఇన్ ఇండియా వేరియంట్ 220ఐ స్పోర్ట్ మార్కెట్లోకి విడుదలైంది. 7.1 సెకన్లలో.. 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం ఉన్న ఈ కొత్త వేరియంట్ ధర సహా.. భారత్‌లో త్వరలో విడుదల కానున్న ట్రయంఫ్ ట్రైడెంట్ 660 బైక్ విశేషాలు మీకోసం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- యువ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ దూరం..
ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో గాయపడిన భారత యువ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్.. మిగతా రెండు వన్డేలకు దూరమయ్యాడు. ఐపీఎల్ 14వ సీజన్లోనూ అతడు ఆడేది అనుమానమేనని బీసీసీఐ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మంచు తుపానులో ఇరుక్కున్న 'కార్తికేయ 2'
హీరో నిఖిల్ నటిస్తున్న 'కార్తికేయ 2' షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. హిమచల్ ప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండగా నిఖిల్ సహా చిత్రబృందం మంచు తుపానులో ఇరుక్కుపోవడమే ఇందుకు కారణం. ఈ వీడియోను మూవీ టీం పోస్ట్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టాలీవుడ్ హీరోల వ్యాపారం
టాలీవుడ్ స్టార్ హీరోలు ఓ వైపు భారీ చిత్రాలతో అలరిస్తూనే తమకు సంబంధించిన వ్యాపారాల్లోనూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కొందరు బడా హీరోలు మల్టీప్లెక్స్ వ్యాపారంలోనూ అడుగుపెట్టారు. మరికొందరు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.