ETV Bharat / offbeat

నోట్లో వేసుకుంటే కరిగిపోయే "బనానా బర్ఫీ" - ఈజీగా చేసుకోండిలా! - తింటే ఆహా అనాల్సిందే! - BANANA BARFI RECIPE

రెగ్యులర్​ స్వీట్స్​ను మించిన టేస్ట్​ - కేవలం నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు!

How to Make Banana Barfi
Banana Barfi Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 3, 2024, 1:11 PM IST

How to Make Banana Barfi Recipe : చాలా మందికి స్వీట్స్​ అంటే ఎంతో ఇష్టం. ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లినా స్వీట్స్​ చూడగానే నోరూరుతుంది. అయితే, మిఠాయి దుకాణాల్లో దొరికే స్వీట్స్ ఆరోగ్యానికి అంత మంచివి కాకపోవచ్చు. కాబట్టి, ఈసారి ఎప్పుడైనా స్వీట్స్ తినాలనిపించినప్పుడు ఇలా "బనానా బర్ఫీని" ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అరటిపండు తినడానికి ఇష్టపడని వారు దీన్ని ​ఎంతో ఇష్టంగా తింటారు. పైగా దీని కోసం పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. తక్కువ పదార్థాలతో ఎవరైనా చాలా సింపుల్​గా ఈ స్వీట్​ను తయారు చేసుకోవచ్చు. ఇంతకీ, ఈ సూపర్ టేస్టీ స్వీట్ రెసిపీకి అవసరమైన పదార్థాలేంటి? తయారీ విధానమేంటి? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • ముప్పావు కప్పు - గోధుమపిండి
  • 1 కప్పు - పంచదార
  • పావు కప్పు - ఉప్మారవ్వ
  • 4 - అరటిపండ్లు
  • 4 టేబుల్‌స్పూన్లు - నెయ్యి
  • అరకప్పు - బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు
  • పావుచెంచా - యాలకుల పొడి

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా అరటిపండ్లను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై వాటిని మిక్సీజార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని రెండు టేబుల్​స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. అది కరిగి వేడయ్యాక.. బాదం, పిస్తా, జీడిపప్పులను వేసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత వాటిని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కనుంచాలి.
  • అనంతరం అదే కడాయిలో గోధుమపిండి వేసి కలుపుతూ వేయించుకోవాలి. అది కాస్త వేగాక.. ఉప్మారవ్వ యాడ్ చేసుకొని వేయించి దించేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ మీద మరో పాత్ర పెట్టుకొని కప్పు వాటర్ పోసుకొని పంచదార, యాలకుల పొడి వేసి మరిగించుకోవాలి.
  • పాకం కాస్త చిక్కబడ్డాక.. వేయించి పక్కన పెట్టుకున్న గోధుమపిండి మిశ్రమం, ఇంకాస్త నెయ్యి, వేయించుకున్న డ్రైఫ్రూట్స్‌ పలుకులు కొన్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద ఉడికించాలి.
  • బర్ఫీ మిశ్రమం కడాయిలో అంటుకోకుండా విడిపోయినప్పుడు స్టౌ ఆఫ్ చేసుకొని కడాయి దించేసుకోవాలి. ఆపై ఒక ట్రేలో నెయ్యి కాస్త అప్లై చేసుకొని అందులో మీరు ప్రిపేర్ చేసుకున్న బర్ఫీ మిశ్రమాన్ని వేసుకొని సమంగా సర్దాలి.
  • ఆ తర్వాత దాని మీద మిగిలిన డ్రైఫ్రూట్స్​ పలుకులతో గార్నిష్ చేసుకోవాలి. ఆపై మీకు కావాల్సిన షేప్​లో ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "బనానా బర్ఫీ" రెడీ.
  • మరి, ఇంకెందుకు ఆలస్యం నచ్చితే మీరూ ఓసారి ప్రయత్నించి చూడండి. ఇంట్లిపాదీ ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు!

ఇవీ చదవండి :

మరమరాలతో చాట్​ రొటీన్​ - ఇలా సూపర్ "బర్ఫీ" చేయండి - టేస్ట్​ అద్దిరిపోతుంది!

స్పెషల్ ఆరెంజ్ బర్ఫీ - ఈజీగా ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్ సూపర్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.