Skoda Kylaq All Variants Price List: స్కోడా ఆటో ఇండియా తన అతి చిన్న కంపాక్ట్ SUV 'స్కోడా కైలాక్' అన్ని వేరియంట్‌ల ధరలను రివీల్ చేసింది. ఇది భారతదేశంలో మొట్టమొదటి స్కోడా కారు. కంపెనీ ఈ కారుతో సబ్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది. ఈ కారును కొత్త మోడ్రన్ సాలిడ్ డిజైన్‌తో ఇటీవలే నవంబర్ నెలలో లాంఛ్ చేసింది. మార్కెట్లో దీని బుకింగ్స్ డిసెంబర్ 2 నుంచి ప్రారంభమయ్యాయి. అయితే దీని డెలివరీలు వచ్చే ఏడాది జనవరి 27 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా వేరియంట్ల వైజ్‌గా దీని ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
ట్రిమ్ ఆప్షన్స్: స్కోడా కైలాక్ మొత్తం నాలుగు ట్రిమ్‌లలో వస్తుంది.
- క్లాసిక్ (Classic)
- సిగ్నేచర్ (Signature)
- సిగ్నేచర్+ (Signature+)
- ప్రెస్టీజ్ (Prestige)
Complete Price List of Skoda Kylaq:
Skoda Kylaq Trim | Petrol MT | Petrol AT |
Classic | Rs 7.89 lakh | - |
Signature | Rs 9.59 lakh | Rs 10.59 lakh |
Signature+ | Rs 11.40 lakh | Rs 12.40 lakh |
Prestige | Rs 13.35 lakh | Rs 14.40 lakh |
*All prices ex-showroom |
కలర్ ఆప్షన్స్: ఈ కారు మార్కెట్లో ఏడు రంగులలో అందుబాటులో ఉంది.
- టోర్నాడో రెడ్ (Tornado Red)
- బ్రిలియంట్ సిల్వర్ (Brilliant Silver)
- క్యాండీ వైట్ (Candy White)
- కార్బన్ స్టీల్ (Carbon Steel)
- లావా బ్లూ (Lava Blue)
- డీప్ బ్లాక్ (Deep Black)
- ఆలివ్ గోల్డ్ (Olive Gold)
వీటితోపాటు కంపెనీ ఈ కారుకు 3 సంవత్సరాలు/లక్ష కిలోమీటర్ల వారంటీని కూడా ఆఫర్ చేస్తోంది. అంతేకాక స్టాండర్డ్ వారంటీని కూడా అందిస్తోంది.
ఫీచర్లు: స్కోడా కైలాక్ లైనప్ ప్రారంభ ధర రూ.7.89 లక్షలు. ఇది ఎంట్రీ లెవల్ క్లాసిక్ ట్రిమ్. ఈ ట్రిమ్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టిల్ట్, టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల వింగ్ మిర్రర్లతో పాటు ఇందులో అన్నీ LED లైట్లే ఉన్నాయి. అయితే ఈ వేరియంట్లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదు.
ఇక స్కోడా కైలాక్ సిగ్నేచర్ మాన్యువల్ గేర్‌బాక్స్ ధర 9.59 లక్షలు. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ధర రూ.10.59 లక్షలు. ఇందులో 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్‌తో పాటు రియర్ ఏసీ వెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
టాప్-స్పెక్ స్కోడా కైలాక్ ప్రెస్టీజ్ మాన్యువల్ ఎడిషన్ ధర రూ. 13.35 లక్షలు. ఇక దీని ప్యాడిల్ షిఫ్టర్‌లతో కూడిన ఆటోమేటిక్ వెర్షన్ ధరను రూ. 14.40 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో సింగిల్-పేన్ సన్‌రూఫ్, 17-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, వైపర్‌లు, కార్నరింగ్ ఫంక్షన్‌తో LED ఫాగ్ ల్యాంప్స్, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
పవర్ ట్రెయిన్ అండ్ స్పెసిఫికేషన్లు: ఈ కారును కేవలం 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పరిచయం చేశారు. ఇది ఇతర స్కోడా, వోక్స్‌వ్యాగన్ కార్లలో కన్పిస్తుంది. ఈ ఇంజిన్ 114bhp పవర్, 178nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంది. ఈ కారు 10.5 సెకన్లలో గంటకు 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుందని కంపెనీ చెబుతోంది.
బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్- ఆ బైక్‌పై ఏకంగా రూ.20వేలు తగ్గింపు.. ఇయర్ ఎండ్ ఆఫర్ అదిరిపోలా..!
తిప్పరా మీసం.. భారత్ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రకు సర్వం సిద్ధం!
సన్‌రూఫ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, అద్భుతమైన మైలేజ్.. అదిరే ఫీచర్లతో రూ.8 లక్షల లోపు బెస్ట్ కార్లు ఇవే!