ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​@ 9 PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana news
టాప్​టెన్​ న్యూస్​@ 9 PM
author img

By

Published : Mar 23, 2021, 8:59 PM IST

విద్యాసంస్థలు బంద్​

రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య కళాశాలలు మినహా అన్ని విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శాసనసభలో ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారు'

తెలంగాణలో ఆయా ప్రాంతాల్లో పండే పంటలకు అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

నల్లమలలో మంటలు..

నాగర్‌కర్నూలు జిల్లా నల్లమల అటవీప్రాంతంలో మరోసారి మంటలు చెలరేగాయి. దుర్వాసుల చెరువు, గుండం బేస్‌ క్యాంప్ పరిసరాల్లో మంటలు వ్యాపించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్​?

సంగారెడ్డిలో పోలీసుల తీరు తీవ్రచర్చనీయాంశమైంది. ఫ్రెండ్లీ పోలీసులుగా పేరున్న శాఖకు కొంతమంది తీరు విమర్శలకు తావిచ్చేదిగా చేస్తోంది. అందరూ చూస్తుండగానే ఓ డ్రైవర్‌పై కొందరు పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారు. నిన్న జరిగిన ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్.... ఓ ఏఎస్​ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, మరో హోంగార్డుపై చర్యలు తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

80 కేజీల బంగారం​ స్వాధీనం

ఎన్నికల వేళ తమిళనాడులో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వాహనాలు తనిఖీ చేస్తుండగా 80 కిలోల బంగారం పట్టుబడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కరోనా పరీక్షలు పెంచాలి

మరోసారి ఉద్ధృతి పెంచిన కొవిడ్-19 కట్టడికి నూతన మార్గదర్శాకాలు జారీచేసింది కేంద్రం. తక్షణమే ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలు సహా టీకాల పంపిణీ వేగవంతం చేయాలని రాష్ట్రాలకు చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సైబర్​ నేరగాళ్ల వల నుంచి ఇలా తప్పించుకోండి..

సైబర్​ నేరగాళ్లు ఇటీవలి కాలంలో కొత్త కొత్త మార్గాల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. క్రిడిట్​ కార్డులు ఇస్తామని, క్యాష్​ బ్యాక్​ ఒచ్చిందనే నెపంతో వ్యక్తిగత డేటా, బ్యాంకు ఖాతాలో సొమ్ము కాజేస్తున్నారు. ఇలాంటి మోసాలు ఎలా జరుగుతున్నాయి? వాటిని గుర్తించడం ఎలా? అలాంటి మోసాల బారిన పడకుండా ఏం చేయాలి? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

లంకకు వ్యతిరేకంగా తీర్మానం

శ్రీలంకలో మానవ హక్కుల ఉల్లంఘన, జవాబుదారీతనం లోపించడం వంటి అంశాలపై విచారణ జరిపే తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి(యూఎన్​హెచ్ఆర్​సీ) ఆమోదించింది. ఈ ఓటింగ్​కు దూరంగా ఉన్న భారత్​.. శ్రీలంకలో పౌరుల మానవ హక్కులను అక్కడి ప్రభుత్వం పరిరక్షించాలని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

లక్ష్యం దిశగా ఇంగ్లండ్.. వికెట్ల వేటలో భారత్

ఇంగ్లాండ్​తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 317 పరుగులు చేసింది. టీమ్​ఇండియా బ్యాట్స్​మెన్​లో విరాట్, ధావన్, కృనాల్, రాహుల్ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. బ్యాంటింగ్​లో ఇంగ్లాండ్ కూడా జోరుగానే ఉంది. ఓవైపు వికెట్లు పడిపోతున్నా.. విజయం దిశగా అడుగులు వేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'అరణ్య' విడుదల వాయిదా

హీరో రానా నటించిన 'అరణ్య' సినిమా మార్చి 26న హిందీలో విడుదల కావడం లేదు. కరోనా కారణంగా తాత్కాలికంగా రిలీజ్​ డేట్​ను వాయిదా వేసినట్లు ప్రకటించింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.