విద్యాసంస్థలు బంద్..
రేపట్నుంచి విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు మూసివేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకొందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
దేశానికే ఆదర్శం..
రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల బొప్పాపూర్‌లో రైతు వేదికను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు వేదికలు నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. రైతుల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టిందని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కరోనాపై నూతన మార్గదర్శకాలు
మరోసారి ఉద్ధృతి పెంచిన కొవిడ్-19 కట్టడికి నూతన మార్గదర్శాకాలు జారీచేసింది కేంద్రం. తక్షణమే ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు సహా టీకాల పంపిణీ వేగవంతం చేయాలని రాష్ట్రాలకు చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
నక్సల్స్ ఘాతుకం..
ఛత్తీసగఢ్ నారాయణ్‌పుర్ జిల్లా కన్హర్గావ్లో నక్సల్స్ ఘాతుకానికి పాల్పడ్డారు. జిల్లా రిజర్వు గార్డు(డీఆర్జీ) జవాన్లు వెళ్తున్న బస్సును ఐఈడీతో పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'బంగాలీ ఆత్మగౌరవం' దీదీని గెలిపించేనా?
"లోకల్ వర్సెస్ నాన్-లోకల్".... బంగాల్ రాజకీయం ప్రస్తుతం ఇదే అంశం చుట్టూ తిరుగుతోంది. మోదీ-షా ద్వయాన్ని ఎదుర్కొనేందుకు బంగాలీ ఆత్మగౌరవాన్ని అస్త్రంగా మలుచుకుంటోంది అధికార తృణమూల్ కాంగ్రెస్. ఇంతకీ ఈ వ్యూహం ఫలిస్తుందా? తిప్పికొట్టేందుకు భాజపా ఏం చేస్తోంది? శాసనసభ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
బైడెన్ ప్రభుత్వానికి చిక్కులు..
వలసల విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న బైడెన్ ప్రభుత్వానికి మరిన్ని చిక్కులు వచ్చి పడ్డాయి. మెక్సికో సరిహద్దుల్లో శరణార్థ చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉందంటూ అధికార పార్టీ నేత ఒకరు ఫొటోలు విడుదల చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
14 మందికి మరణశిక్ష..
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా హత్యకు కుట్రపన్నిన 14 మంది ఇస్లామిక్ ఉగ్రవాదులకు ఆ దేశ ఉన్నత న్యాయస్థానం మరణశిక్షను విధించింది. దోషులందరూ నిషేధిత హర్కతుల్ జిహాద్ బంగ్లాదేశ్(హుజీ-బి)కి చెందిన ఉగ్రవాదులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అదరగొట్టిన భారత బ్యాట్స్‌మెన్
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 317 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్‌లో విరాట్, ధావన్, కృనాల్, రాహుల్ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 3, మార్క్ వుడ్ 2 వికెట్లు తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
భారత్‌కు మరో స్వర్ణం..
ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో భారత షూటర్లు సత్తా చాటుతున్నారు. స్కీట్ మిక్స్డ్ విభాగంలో మరో స్వర్ణాన్ని సాధించిన భారత జోడీ.. మొత్తం 7 బంగారు పతకాలతో పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కొత్త సినిమా అప్డేట్స్
నితిన్ 'రంగ్ దే' సినిమా, 'జాతిరత్నాలు'లోని వీడియో సాంగ్స్ విడుదలై శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. దీంతో పాటే మరిన్ని చిత్ర విశేషాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.