ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​@ 7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana latest top news
టాప్​టెన్​ న్యూస్​@ 7PM
author img

By

Published : Mar 14, 2021, 6:58 PM IST

  • ధన్యవాదాలు చెప్పిన కేటీఆర్​..

ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటుహక్కు వినియోగించుకోవాలన్న తమ విజ్ఞప్తికి స్పందించిన ప్రతి ఒక్క విద్యావంతునికి కేటీఆర్​ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ యంత్రాంగం మొత్తం గత రెండు వారాలుగా ఎన్నికల్లో విజయం కోసం కృషి చేసిందని... పార్టీ ప్రయత్నాలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని కేటీఆర్ అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • విజయంపై బండి ధీమా..

కోట్లు ఖర్చు పెట్టినా.. తెరాసకు రెండో స్థానం కూడా దక్కదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో భాజపాదే విజయమని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • దేశాన్ని విభజించే శక్తులతో..

దేశ విభజనకు యత్నించే శక్తులతో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుంటోందని ఆరోపించారు కేంద్ర హోంత్రి అమిత్​ షా. అసోం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఏఐయూడీఎఫ్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్​ చేతిలో అసోం సురక్షితంగా ఉండదని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'పట్టపగలే మోదీ సర్కార్​ దోపిడీ'

2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మోదీ ప్రభుత్వం.. పెట్రోల్‌పై పన్నులు విధిస్తూ రూ.21లక్షల కోట్లు వసూలు చేసిందని రాహుల్​ గాంధీ ఆరోపించారు. గ్యాస్​, డీజల్, పెట్రోల్​ ధరలు పెంచి కేంద్ర పట్టపగలే ప్రజలను దోచుకుంటోందని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • గాయపడిన పులి..

తన జీవితంలో ఎన్నో దాడులను ఎదుర్కొన్నానని, ఇప్పటివరకు ఎవరికీ తలొగ్గలేదని బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. తన కాలికి అయిన గాయాన్ని ఉద్దేశిస్తూ గాయపడిన పులి మరింత ప్రమాదకరమని అన్నారు. వీల్‌ ఛైర్‌లోనే తన ప్రచారాన్ని కొననసాగిస్తానని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 7 గంటల్లో 7 వేల కిలోల వంటకం

మహారాష్ట్ర పుణెలో ఓ అరుదైన కార్యక్రమాన్ని నిర్వహించి రికార్డు సాధించింది సూర్యదత్త గ్రూప్​ ఆఫ్ ఇనిస్టిట్యూట్స్. ఏకంగా 7,000 కేజీల 'పుణెరి మిసల్' వంటకాన్ని చేయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బౌలింగ్​ ఎంచుకున్న టీమ్ ​ఇండియా

నరేంద్రమోదీ స్టేడియంలో ఇంగ్లాండ్​తో జరుగుతున్న రెండో టీ20లో భారత్​ టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మొతేరా పిచ్​కు ఐసీసీ రేటింగ్​

వివాదాస్పదంగా మారిన మొతేరా పిచ్​కు.. ఐసీసీ మ్యాచులు వారీగా రేటింగ్​ ప్రకటించింది. మూడో టెస్టుకు ఫర్వాలేదని, నాలుగో టెస్టుకు బాగుందని తెలిపింది. ​పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బ్యాంకులు బంద్

రెండు ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ తొమ్మిది బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు సోమ, మంగళవారాల్లో బందుకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు 'యూనైటెడ్​​ ఫోరం ఆఫ్​ బ్యాంక్​ యూనియన్స్​'(యూఎఫ్​బీయూ) ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'సారంగ దరియా' పాట రికార్డు

'లవ్​స్టోరి' సినిమాలోని 'సారంగ దరియా' యూట్యూబ్​లో దుమ్ముదులుపుతోంది. ఈ క్రమంలో సరికొత్త రికార్డు కూడా సృష్టించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.