భగ్గుమన్న ఉద్యోగ సంఘాలు..
పీఆర్సీ కమిటీ నివేదికపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. 7.5 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలన్న కమిటీ సిఫార్సులను తప్పుపడుతూ... ఆందోళనలకు దిగాయి. నివేదిక ప్రతులను తగులబెట్టి.... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఫిట్‌మెంట్ డిమాండ్లు..
సీఎం కేసీఆర్‌పై తమకు నమ్మకం ఉందని... ఆయన ఉద్యోగుల పక్షానే ఉంటారని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. పీఆర్‌సీ అడ్వైజరీ కమిటీ మాత్రమేనని అన్నారు. గతంలో ఇచ్చిన ఫిట్‌మెంట్ కంటే తగ్గకుండా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మార్కెట్లో ముఖ్యమంత్రి..
సిద్దిపేట వంటిమామిడి కూరగాయల మార్కెట్‌ను సీఎం కేసీఆర్ పరిశీలించారు. మార్కెట్‌లో రైతులు, వ్యాపారులతో ముచ్చటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
నెలాఖరులోపు పదోన్నతులు!
పదోన్నతుల ప్రక్రియపై అన్నిశాఖల కార్యదర్శులతో సీఎస్ సోమేశ్‌కుమార్ సమీక్షించారు. నెలాఖరులోపు పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. ఎక్కువ మందికి పదోన్నతులు లభించాలనేది ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రైతు ఉద్యమానికి బీటలు!
ట్రాక్టర్ ర్యాలీ నిరసనలతో దద్దరిల్లిన దిల్లీలో బుధవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. హింసాకాండకు సంబంధించి పోలీసులు 22 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మంగళవారం జరిగిన బీభత్సానికి కారణమైన వారిపై చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. దిల్లీలో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. మరోవైపు హింసాత్మక ఘటనలతో రైతు సంఘాల్లో చీలిక ఏర్పడినట్టు కనిపిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
దున్నపోతు కోసం మూడు గ్రామాల గొడవ..
దున్నపోతు కోసం మూడూళ్ల ప్రజలు తీవ్రంగా పోట్లాడుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని దావనగెరె జిల్లాలో జరిగింది. అనంతరం పోలీసులు పరిస్థితిని అదుపుచేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
53 మంది సజీవదహనం
మధ్యఆఫ్రికా దేశం కామెరూన్లో ఘోర ప్రమాదం జరిగింది. తీర ప్రాంత డౌలా నగరం నుంచి బఫౌసం వైపు వెళ్తున్న బస్సు.. శాంత్చౌ గ్రామం దగ్గర ట్రక్కును ఢీ కొట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కుప్పకూలిన మార్కెట్లు
స్టాక్ మార్కెట్లపై మరోసారి బేర్ పంజా విసిరింది. బుధవారం సెషన్లో సెన్సెక్స్, నిఫ్టీ సుమారు 2 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి. దాదాపు అన్ని రంగాలు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడం, కేంద్ర బడ్జెట్ ముందు నెలకొన్న భయాలు సహా పలు ఇతర అంశాలు నష్టాలకు కారణమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కోహ్లీ నంబర్ వన్- 2
ఐసీసీ తాజా వన్డే ర్యాంకులు ప్రకటించింది. బ్యాటింగ్ విభాగంలో భారత కెప్టెన్, వైస్ కెప్టెన్లు తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఇక బౌలింగ్ విభాగంలో బుమ్రా మూడో స్థానంలో ఉన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రభాస్‌కు హీరోయిన్గా శ్రుతిహాసన్?
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం 'సలార్'లో శ్రుతిహాసన్ ఎంపికైందని సమాచారం. బాలీవుడ్‌లోనూ గుర్తింపు ఉన్న భామను ఈ సినిమా కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.