ETV Bharat / city

Telangana News Today టాప్​న్యూస్ 5PM - తెలంగాణ వార్తలు

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

5PM TOPNEWS
5PM TOPNEWS
author img

By

Published : Aug 26, 2022, 5:00 PM IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రను ఆపేయాలంటూ ప్రభుత్వం హైకోర్టులో వేసిన అప్పీల్‌పై విచారణ వాయిదా పడింది. సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

  • ప్రశాంతంగా ముగిసిన ముస్లింల ప్రార్థనలు

హైదరాబాద్​లో ఎమ్మెల్యే రాజాసింగ్​ వివాదాస్పద వ్యాఖ్యలు, నిరసనలు, అరెస్టుల వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు భద్రతా చర్యలను పటిష్ఠం చేశారు. ప్రధానంగా పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో అడుగడుగునా ర్యాపిడ్ యాక్షన్​ ఫోర్స్​, పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • బండి సంజయ్ పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత

జనగామ జిల్లాలో బండి సంజయ్‌ పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కునూరుకు చేరుకున్న సంజయ్‌ పాదయాత్రను కొందరు తెరాస శ్రేణులు అడ్డుకునేందుకు యత్నించారు. అది గమనించిన భాజపా కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగారు.

  • కేంద్ర దర్యాప్తు సంస్థలు భాజపాకు జేబు సంస్థలుగా మారాయన్న హరీశ్​రావు

భాజపా నేతలు నిరాధార ఆరోపణలతో ఎమ్మెల్సీ కవితపై బురద జల్లేందుకు యత్నిస్తున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు ఆరోపించారు.

  • హైటెన్షన్​ తీగలపై ఎక్కి టెన్షన్ పెట్టించిన కొండచిలువ

రంగారెడ్డి జిల్లాలో కొండచిలువ కలకలం సృష్టించింది. ఓ పొలంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి హల్​చల్ చేసింది. దీంతో అక్కడి రైతులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే వారు అటవీశాఖ, విద్యుత్​శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు కొండచిలువను బంధించారు.

  • కుప్పానికి నీళ్లివ్వలేని జగన్ అరాచకం సృష్టిస్తున్నారన్న చంద్రబాబు

ఏపీలోని కుప్పానికి నీళ్లివ్వలేని ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి అరాచకం సృష్టిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అన్న క్యాంటీన్లపై దాడులు చేయించి రాక్షసానందం పొందుతున్నారని ఆక్షేపించారు.

  • సీబీఐ కోర్టులో జగన్ వ్యక్తిగత హాజరుకు హైకోర్టు మినహాయింపు

రోజువారీ విచారణకు ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్ వ్యక్తిగతంగా హాజరుకావాలన్న సీబీఐ కోర్టు ఆదేశాలను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. రోజువారీ విచారణపై జగన్​ పిటిషన్​ దాఖలు చేయగా సీబీఐ కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

  • అనసూయ ఫైనల్ వార్నింగ్

ప్రముఖ వ్యాఖ్యాత, నటి అనసూయ సామాజిక మాధ్యమాల వేదికగా ట్రోలింగ్ చేసేవారిని తీవ్రంగా హెచ్చరించారు. ఇకపై తనను, తన కుటుంబాన్ని అవమానిస్తూ ట్వీట్స్‌ చేస్తే వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.

  • ఆ విషయంలో బాధగా ఉందన్న జస్టిస్ రమణ

అన్ని కోర్టుల నుంచి ప్రత్యక్ష ప్రసారం జరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్​వీ రమణ ఆకాంక్షించారు. సాంకేతిక మార్పులను న్యాయవ్యవస్థ అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు.

  • కొత్త పార్టీ ఏర్పాటు దిశగా గులాం నబీ ఆజాద్

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన వేరే పార్టీలో చేరేది లేదని ఆయన సన్నిహితుడు ఒకరు మీడియాకు తెలిపారు.

  • బండి సంజయ్‌ పాదయాత్రపై ప్రభుత్వం అప్పీల్‌, విచారణ వాయిదా

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రను ఆపేయాలంటూ ప్రభుత్వం హైకోర్టులో వేసిన అప్పీల్‌పై విచారణ వాయిదా పడింది. సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

  • ప్రశాంతంగా ముగిసిన ముస్లింల ప్రార్థనలు

హైదరాబాద్​లో ఎమ్మెల్యే రాజాసింగ్​ వివాదాస్పద వ్యాఖ్యలు, నిరసనలు, అరెస్టుల వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు భద్రతా చర్యలను పటిష్ఠం చేశారు. ప్రధానంగా పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో అడుగడుగునా ర్యాపిడ్ యాక్షన్​ ఫోర్స్​, పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • బండి సంజయ్ పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత

జనగామ జిల్లాలో బండి సంజయ్‌ పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కునూరుకు చేరుకున్న సంజయ్‌ పాదయాత్రను కొందరు తెరాస శ్రేణులు అడ్డుకునేందుకు యత్నించారు. అది గమనించిన భాజపా కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగారు.

  • కేంద్ర దర్యాప్తు సంస్థలు భాజపాకు జేబు సంస్థలుగా మారాయన్న హరీశ్​రావు

భాజపా నేతలు నిరాధార ఆరోపణలతో ఎమ్మెల్సీ కవితపై బురద జల్లేందుకు యత్నిస్తున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు ఆరోపించారు.

  • హైటెన్షన్​ తీగలపై ఎక్కి టెన్షన్ పెట్టించిన కొండచిలువ

రంగారెడ్డి జిల్లాలో కొండచిలువ కలకలం సృష్టించింది. ఓ పొలంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి హల్​చల్ చేసింది. దీంతో అక్కడి రైతులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే వారు అటవీశాఖ, విద్యుత్​శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు కొండచిలువను బంధించారు.

  • కుప్పానికి నీళ్లివ్వలేని జగన్ అరాచకం సృష్టిస్తున్నారన్న చంద్రబాబు

ఏపీలోని కుప్పానికి నీళ్లివ్వలేని ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి అరాచకం సృష్టిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అన్న క్యాంటీన్లపై దాడులు చేయించి రాక్షసానందం పొందుతున్నారని ఆక్షేపించారు.

  • సీబీఐ కోర్టులో జగన్ వ్యక్తిగత హాజరుకు హైకోర్టు మినహాయింపు

రోజువారీ విచారణకు ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్ వ్యక్తిగతంగా హాజరుకావాలన్న సీబీఐ కోర్టు ఆదేశాలను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. రోజువారీ విచారణపై జగన్​ పిటిషన్​ దాఖలు చేయగా సీబీఐ కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

  • అనసూయ ఫైనల్ వార్నింగ్

ప్రముఖ వ్యాఖ్యాత, నటి అనసూయ సామాజిక మాధ్యమాల వేదికగా ట్రోలింగ్ చేసేవారిని తీవ్రంగా హెచ్చరించారు. ఇకపై తనను, తన కుటుంబాన్ని అవమానిస్తూ ట్వీట్స్‌ చేస్తే వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.