1. ఏవోబీలో ఎదురుకాల్పులు..
ఏవోబీలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. సుమారు 10 మంది తప్పించుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
2. 18వ రోజుకు చేరిన రైతుల ఆందోళన
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు 18వ రోజుకు చేరుకున్నాయి. దిల్లీ-హరియాణా సరిహద్దు ప్రాంతం సింఘులో ఎముకలు కొరికేచలిలోనూ నిరసన వ్యక్తం చేస్తున్నారు రైతులు. నూతన సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలను మరింత ఉద్ధృతం చేసేందుకు డిసెంబర్ 14న సింఘు సరిహద్దులో నిరహార దీక్ష చేపడతామని రైతు సంఘాల నాయకులు ఇప్పటికే స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
3. హైదరాబాద్‌కు సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ దిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. ముఖ్యమంత్రి దిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితోపాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారు. శనివారం ప్రధాని మోదీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో భేటీ అయ్యారు. అంతకు ముందు రోజు కేంద్ర హోంశాఖ, జల్‌శక్తి శాఖ మంత్రులను కలిశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
4. రక్తసిక్తం
తెలంగాణలోని పలు రోడ్లు నెత్తురోడాయి. రాష్ట్రంలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మృత్యువాత పడ్డారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు చనిపోగా.. రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు చొప్పున, కూకట్‌పల్లిలో ఒకరు మృతి చెందారు. ఈ నాలుగు ఘటనల్లో అతివేగమే కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
5. రిపబ్లిక్ టీవీ సీఈఓ అరెస్ట్
టీఆర్పీ అవకతవకల కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. రిపబ్లిక్ టీవీ సీఈఓను ఈ రోజు ఉదయం అరెస్టు చేసినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
6. ఆ దేశాల్లో కరోనా విజృంభణ
జపాన్, దక్షిణ కొరియా దేశాల్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. జపాన్‌లో రికార్డు స్థాయిలో రోజూవారీ కేసులు నమోదవుతున్నాయి. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు జపాన్‌లో నిబంధనలు సడలించినందు వల్ల కేసుల సంఖ్య భారీగా పెరుగుతోందని అధికారులు నిర్ధరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
7. రోజూ గుడ్డు ఎందుకు తినాలంటే.?
కరోనా కాలంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ప్రాధాన్యం ఏర్పడింది. ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా బహుళ పోషకాలకు నిలయమైన కోడిగుడ్డును తీసుకుంటే అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
8. నెలలోనే 8.5% వడ్డీ జమ!
2019-20 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి మొత్తాలపై నిర్ణయించిన 8.5 శాతం వడ్డీ రేటుపై ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 6 కోట్ల చందాదారులకు 8.5 శాతం వడ్డీని ఒకే విడతలో చెల్లించాలని యోచిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
9. బాబర్ అజామ్‌కు గాయం
గాయం కారణంగా న్యూజిలాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్. ఇతడి స్థానంలో షాదాబ్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
10. 'ఎఫ్ 3' సందడి మొదలు
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం 'ఎఫ్ 2'. గతేడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. 'ఎఫ్ 3'ని త్వరలోనే పట్టాలెక్కించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది చిత్రబృందం. తాజాగా నేడు (ఆదివారం) వెంకీ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..