తెలంగాణలో ఉన్న అభివృద్ధి భాజపా పాలిత ప్రాంతాల్లో లేదని రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు పరిశ్రమల ఏర్పాటుకు తీసుకువచ్చిన విధానాలతో ఎన్నో బహుళజాతి కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. హైదరాబాద్ మహానగరాన్ని ఐటీ రంగంలో నంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత కేటీఆర్‌దేనని చెప్పారు.
హైదరాబాద్ కేపీహెచ్బీలో పర్యటించిన మంత్రి మల్లారెడ్డి.. వివిధ పార్టీలకు చెందిన 300 మంది కార్యకర్తలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు దక్కకుండా చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
- ఇదీ చదవండి : దేశాభివృద్ధి కోసం అన్ని రంగాల్లో మార్పులు: మోదీ