ETV Bharat / city

ఆగస్టు నాటికి ప్రతి గ్రామానికీ టీ-ఫైబర్​ సేవలు! - telangana latest news

బ్రాడ్ బ్యాండ్ సౌకర్యాన్ని ఒక యుటిలిటీగా పరిగణించి.. పట్టణాల్లోని ప్రతి ఇంటికీ అనుసంధానించే విధానాన్ని అధ్యయనం చేయాలని ఐటీశాఖ మంత్రి కేటీఆర్​ అధికారులకు ఆదేశించారు. మిషన్ భగీరథ పనులు పూర్తైన గ్రామీణ ప్రాంతాల్లో టీ- ఫైబర్ పనులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఆగస్టు నాటికి ప్రతీ గ్రామానికి టీ-ఫైబర్ కనెక్టివిటీ ఇచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు అధికారులు వివరించారు.

ktr review on t fiber
ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్​పై మంత్రి కేటీఆర్​ సమీక్ష
author img

By

Published : Apr 8, 2021, 3:48 PM IST

ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పరిధిని రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాలకూ విస్తరించాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు విస్తరణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ సర్వే చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు.

హైదరాబాద్‌ టీ-హబ్​లో జరిగిన ఫైబర్ గ్రిడ్ కార్పోరేషన్ బోర్డు సమావేశంలో పనుల పురోగతిని సమీక్షించారు. మిషన్ భగీరథ పనులు పూర్తైన గ్రామీణ ప్రాంతాల్లో టీ- ఫైబర్ పనులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఆగస్టు నాటికి ప్రతీ గ్రామానికి టీ-ఫైబర్ కనెక్టివిటీ ఇచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు అధికారులు వివరించారు.

ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ ఇవ్వాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో పనిచేస్తున్నామన్న కేటీఆర్​.. రాష్ట్రంలోని 30 వేల ప్రభుత్వ కార్యాలయాలకు జూన్ నుంచి ప్రాధాన్యత క్రమంలో కనెక్షన్ ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ సూచనల మేరకు రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలను టీ-ఫైబర్‌తో అనుసంధానించాలన్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా 5 రైతు వేదికలకు కనెక్షన్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. బోర్డు ఆదేశాల మేరకు టీ-ఫైబర్‌ను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని అధికారులు వెల్లడించారు.

ఇవీచూడండి: డ్జెట్​ ధరలో హెచ్​పీ 'క్రోమ్‌బుక్‌ 11ఏ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.