ETV Bharat / city

KTR Tweet Today : 'భారత్​లో ఎల్‌పీజీ సిలిండర్‌ ధర ప్రపంచంలోనే అధికం' - కేటీఆర్ ట్వీట్

KTR Tweet Today : కేంద్ర ప్రభుత్వ విధానాలపై ట్వీట్లతో విరుచుకు పడుతున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తాజాగా మరోసారి కేంద్రంపై ఫైర్ అయ్యారు. ఎన్డీఏ అసమర్థ పాలన వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. 45 ఏళ్ల గరిష్ఠానికి నిరుద్యోగం చేరుకుందని మండిపడ్డారు.

KTR Tweet Today
KTR Tweet Today
author img

By

Published : Apr 19, 2022, 10:17 AM IST

KTR Tweet Today : సోషల్ మీడియాలో ఎల్లప్పుడు చురుగ్గా ఉండే రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్.. ఇటీవల కేంద్రంపై ట్విటర్ వార్ ప్రకటించారు. వరుస ట్వీట్లతో మోదీ సర్కార్ తీరును ఎండగడుతున్నారు. తాజాగా ఎన్డీఏ ప్రభుత్వ విధానాలపై కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రంలోని ఎన్డీఏ అసమర్థ పాలన వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ట్విటర్​లో కేటీఆర్ ఆరోపించారు.

KTR Tweet Today
మోదీ సర్కార్​పై కేటీఆర్ ట్వీట్

KTR Tweet on NDA Government : 45 ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగం చేరుకుందని... 30 ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం పెరిగిందని కేటీఆర్ ట్విటర్​లో పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా... పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని.. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఎల్పీజీ ధరలున్నాయని విమర్శించారు. వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోతున్నామని ఆర్బీఐ చెబుతోందని... ఇలాంటి ప్రభుత్వాన్ని ఏమని పిలవాలని ప్రశ్నించారు. ప్రతిభ చూపించని ప్రభుత్వంగా..ఎన్డీఏ చరిత్రలో నిలిచిపోతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.