ETV Bharat / city

కరోనా విషయంలో రాష్ట్రం సురక్షితంగా ఉంది: మంత్రి ఈటల - corona effect in telangana

పక్క రాష్ట్రాల్లో కొవిడ్​ ఉద్ధృతి పెరుగుతున్నందున అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ ఆదేశించారు. ఆస్పత్రులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. కొవిడ్​ నిబంధనలను ప్రజలు పాటించాలని కోరారు.

eetala
కరోనా విషయంలో రాష్ట్రం సురక్షితంగా ఉంది: మంత్రి ఈటల
author img

By

Published : Mar 22, 2021, 9:31 PM IST

కరోనా విషయంలో తెలంగాణ సురక్షితంగా ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు అదుపులోనే ఉన్నాయన్నారు. పక్క రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​, వైద్యారోగ్య శాఖ కార్యదర్శితో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. కేసులు పెరుగుతున్నందున ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఒకవేళ కేసులు పెరిగినా వైద్య సేవలు అందించేలా అన్ని ఆస్పత్రులను సిద్ధంగా ఉంచాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పూర్తిస్థాయిలో గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రిని, గాంధీలో కొవిడ్ వార్డుల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్క్‌లు, ఔషధాలు, ఇంజక్షన్లు, టాబ్లెట్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని మంత్రి ఈటల ఆదేశించారు.

ఇప్పటికే రాష్ట్రంలో రోజుకు 50 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని... ఈ సంఖ్యను మరింత పెంచాలని నిర్ణయించామన్నారు. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు ఎక్కువగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. ప్రజల సంపూర్ణ భాగస్వామ్యంతోనే కట్టడి సాధ్యమని మంత్రి అన్నారు. వైరస్​ పట్ల నిర్లక్షంగా వ్యవహరించవద్దని సూచించారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవాలని కోరారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.

ఇవీచూడండి: 'వ్యాక్సిన్‌ వేయించుకోడానికి ప్రజలు ముందుకు రావడం లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.